జాతీయ వార్తలు

ఫ్రాన్స్ అధ్యక్షుడితో ఐశ్వర్య లంచ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండేతో లంచ్‌లో పాల్గొనే అవకాశం మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య బచ్చన్‌కు దక్కింది. మంగళవారం దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాలాండే హాజరవుతున్న సందర్భంగా అత్యంత ప్రముఖులకు విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విందులో పాల్గొనాల్సిందిగా ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ఐశ్వర్యను ప్రత్యేకంగా ఆహ్వానించింది. బాలీవుడ్‌లో ఈ ఆహ్వానం ఐశ్వర్యకు మాత్రమే అందింది. ప్రధాని, రాష్టప్రతి, కేంద్ర మంత్రులు, విదేశీ అతిథులు విందుకు హాజరవుతారు.