రాష్ట్రీయం

ఐసిస్ కలకలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్‌లో దొరికిన హైదరాబాదీలు
అఫ్గాన్ మీదుగా సిరియా వెళ్లే యత్నం
మహారాష్ట్ర, తెలంగాణ పోలీస్ ఆపరేషన్

హైదరాబాద్, డిసెంబర్ 26: హైదరాబాద్‌లో ఇస్లామిక్ స్టేట్ ఇరాక్, సిరియా ఉగ్రవాదుల ఉనికి కలకలం రేపుతోంది. ఇస్లామిక్ రాజ్యస్థాపనే లక్ష్యంగా పేట్రేగుతోన్న ఐసిస్ ఉగ్రవాదుల వలలో పెద్దలనుంచి మైనర్లూ ఆకర్షితులవ్వడం రాజధానిలో ఆందోళన రెకెత్తిస్తోంది. ఇటీవల హైదరాబాద్ టోలిచౌకికి చెందిన యువతి నిక్కిజోసెఫ్ ఉగ్రవాద భావజాలంతో యువతను ఐసిస్‌లో చేర్చేందుకు యత్నించి దొరికిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఐసిస్‌లో చేరేందుకు వెళ్తున్న ముగ్గురు అనుమానితులను శనివారం నాగపూర్ విమానాశ్రయంలో మహరాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు యువకులు హైదరాబాద్‌లోని స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)కు మాజీ అధ్యక్షుడు సలావుద్దీన్‌కు బంధువులని తెలుస్తోంది. 20 ఏళ్ల వయస్కులు మగ్గురూ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. రోడ్డుమార్గం ద్వారా నాగపూర్ చేరుకొని అక్కడి నుంచి ఇండిగో విమానంలో జమ్ము-కాశ్మీర్‌కు వెళ్లి అక్కడి నుంచి అఫ్గాన్ మీదుగా సిరియా వెళ్లేందుకు యత్నించినట్టు ఇంటెలిజెన్స్ నిఘావర్గాలు పక్కా సమాచారాన్ని సేకరించాయి. తెలంగాణ, మహరాష్ట్ర పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ముగ్గుర్నీ పట్టుకున్నారు. అబ్దుల్ వసీం, ఒమర్ హసన్, ఫారూఖ్ పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా వీరిలో ఇద్దరు ఇంతకుముందు అఫ్గాన్ వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది. సిరియావెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వీరికి సరైన చానెల్ లభించకపోవడంతో పోలీసులకు పట్టుబడ్డారని, వీరికి కౌనె్సలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించినట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్‌కు చెందిన సీనియర్ అధికారి తెలిపారు. ఉగ్రవాద భావజాలంతోనే ఐసిస్‌లో చేరేందుకు బయలుదేరారన్నారు. కానీ వీరికి ఎవరితోనూ సంబంధాలు ఏర్పడలేదని భావిస్తున్నట్టు అధికారి తెలిపారు. గత ఏడాదే వీరికి కౌనె్సలింగ్ నిర్వహించి హైదరాబాద్‌కు పంపించి వారిపై నిఘా పెట్టామని, అయితే వారు ఉగ్రవాద భావజాలం ప్రేరేపిత అంతర్జాలం ఫేస్‌బుక్‌ను అనుసరించినట్టు తెలుస్తోంది. ఇటీవల పుణెకు చెందిన 16 ఏళ్ల మైనర్ అమ్మాయిని కూడా కౌనె్సలింగ్ నిర్వహించి కొరియాకు పంపించినట్టు యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అధికారి ఒకరు తెలిపారు. కాగా సిరియా వెళ్లేందుకు యత్నిస్తున్న ముగ్గురు నగర యువకులను పక్కా సమాచారంతోనే నాగపూర్‌లో అదుపులోకి తీసుకున్నామని, విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్టు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్‌కు తెస్తున్న వీరిని పూర్తిగా విచారిస్తే అసలు విషయం తెలుస్తుందని తెలంగాణ సిఐడి అధికారులు చెబుతున్నారు.