జాతీయ వార్తలు

భాగ్యలక్ష్మి ఆలయం పేల్చివేతకు ఐసిస్ ఉగ్రకుట్ర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాతబస్తీలో ఉగ్రవాద సానుభూతిపరులను విచారించిన సందర్భంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులకు కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. పాతబస్తీలో బుధవారం ఉదయం 11 మందిని అదుపులోకి తీసుకుని ఎన్‌ఐఎ అధికారులు లోతుగా విచారించారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని పేల్చివేసేందుకు ఐసిస్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందన్న విషయాన్ని విచారణలో అనుమానిత వ్యక్తులు వెల్లడించినట్టు సమాచారం. భాగ్యలక్ష్మి ఆలయంతో పాటు ఓ పోలీస్ స్టేషన్‌ను కూడా శక్తివంతమైన బాంబులతో పేల్చివేసేందుకు ఐసిస్ వ్యూహరచన చేసిందని అధికారులు సమాచారాన్ని రాబట్టారు. అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఆరుగురిని విడిచిపెట్టగా, మిగతా అయిదుగురి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. పేలుడు సామగ్రి, విదేశీ కరెన్సీ, రసాయనాలు, ఇతర పరికరాలు ఎక్కడెక్కడి నుంచి సేకరిస్తున్నారన్న విషయమై కూడా ఎన్‌ఐఎ అధికారులు వివరాలు తెలుసుకున్నారు. మరింత సమాచారాన్ని సేకరించేందుకు ఇంకా విచారణ జరపాలని ఆ అయిదుగురిని రిమాండ్ కోరుతూ కోర్టులో ప్రవేశపెట్టారు.