రాష్ట్రీయం

ఐటి హబ్‌గా వరంగల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 19: వరంగల్ నగరాన్ని ఐటి హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కృతనిశ్చయంతో ఉన్నారని సమాచార టెక్నాలజీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కె.తారకరామారావు శుక్రవారం నాడిక్కడ తెలిపారు. ఐటి కంపెనీల ఏర్పాటుతో నగరం మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. మడికొండలోని సెయింట్ ఐటి కంపెనీ భవన్ శంకుస్థాపన, ఐటి ఇంక్యూబేషన్ సెంటర్‌ను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో కెటిఆర్ మాట్లాడారు. మడికొండ ఐటి పార్క్‌లో అన్ని సదుపాయాలు కల్పించామని, మరో మూడు ఐటి కంపెనీలకు స్థలాలు మంజూరు చేశామన్నారు. వరంగల్ నగరంలో ఐటి రంగ అభివృద్ధి ద్వారా విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయన్నారు. వరంగల్ నగరంలో మొట్టమొదటి ఐటి కంపెనీని స్థాపించి నూతన అధ్యయాన్ని రచించినామని, పట్టణ దశ మారబోతోందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఐటి కంపెనీలు స్థాపిస్తామని తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ తరువాత అంతటి ప్రాముఖ్యత ఉన్న వరంగల్ నగరం ఐటిలో వెనుకబడి ఉందన్నారు. వరంగల్ మానవ వనరులు ఉన్న అపారంగా ఉన్న నగరమని పేర్కొన్న ఆయన విద్య, ఐటి రంగాలలో దీన్ని అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. సెయింట్ కంపెనీ అధినేత మోహన్‌రెడ్డి నాస్కామ్‌కు చైర్మన్ అని ఆయన ప్రోత్సాహంతో మరిన్ని కంపెనీలు వరంగల్‌కు రానున్నాయని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఐటి రంగంలో దేశం 13 శాతం వృద్ధి సాధించిందని,రాష్ట్రం 16 శాతం వృద్ధి సాధించిందని తెలిపారు. విద్యార్థులకు నైపుణ్యానికి మెరుగులు దిద్ది ఉపాధి కల్పించేందుకు 15వేల మందికి శిక్షణ కల్పించనున్నామని తెలిపారు. నిట్‌లో ఐటి ఇంక్యూబేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్యోగ కల్పనకు కృషి చేయనున్నట్లు తెలిపారు. సెయింట్ కంపెనీ చైర్మన్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ 32 దేశాలలో విస్తరించి ఉందని, 13వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. అందులో 7వేల మంది హైదరాబాద్‌లో పని చేస్తున్నారని తెలిపారు. రెండవ శ్రేణి నగరాలలో ఐటి అభివృద్ధి ద్వారానే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రోత్సాహంతో వరంగల్‌లో తమ కంపెనీని నెలకొల్పుతున్నట్లు తెలిపారు.