జాతీయ వార్తలు

ప్రతి వేదికపై ఉగ్రవాద వ్యతిరేక పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను కూడగట్టడంలో భారత్ విదేశీ విధానాల్లో భాగమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్భరుద్దీన్ అన్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరులో భారత్ రెండు విజయాలను సాధించిందని తెలిపారు. పూల్వామా దాడి జరిగినపుడు ఆ దాడిని వ్యతిరేకిస్తూ ఐరాసా భద్రతామండలిలో తీర్మానం చేయటం, యూఎన్‌ఎస్‌సీ ఖండించటం ఇదే తొలిసారి అని అన్నారు. అలాగే మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటంతో భారత్ విజయం సాధించిందని అన్నారు. కశ్మీర్ అంశాన్ని ఐరాస సమావేశంలో పాక్ లేవనెత్తుతుందనే అంశంపై మాట్లాడుతూ అసందర్భ ప్రసంగాలతో తమ కాలాన్ని వృథా చేసుకోవటాన్ని వారికే వదిలేస్తున్నామని అన్నారు.