ఆంధ్రప్రదేశ్‌

జనచైతన్య యాత్రలను అడ్డుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాష్ట్ర సదస్సు తీర్మానం
కాపులను జాబితాలో చేర్చే ఆలోచన విరమించుకోవాలి * 27న రాష్ట్ర బంద్

గుంటూరు, డిసెంబర్ 4: వెనుకబడిన తరగతుల జాబితాలో కాపులను చేర్చాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, లేనిపక్షంలో రాష్టబ్రంద్ చేపట్టాలని బిసి రిజర్వేషన్ పరిరక్షణ రాష్టస్రదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. శుక్రవారం బిసి రిజర్వేషన్ల రాష్ట్ర పరిరక్షణ సమితి, బిసి సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. బిసి సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఓర్సు లూర్థురాజ్ అధ్యక్షత వహించగా, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంగిరేకుల వరప్రసాద్ ప్రసంగించారు. వరప్రసాద్ మాట్లాడుతూ సమావేశం చేసిన తీర్మానాల్లో భాగంగా డిసెంబర్ 27న రాష్టబ్రంద్‌ను విజయవంతం చేయాలన్నారు. కాపులను ఏ ప్రాతిపదికన బిసిలలో చేర్చుతారని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న జనచైతన్య యాత్రలను బిసిలు అడ్డుకోవాలన్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, కెఇ కృష్ణమూర్తి, కొల్లు రవీంద్రలను బిసి ద్రోహులుగా వరప్రసాద్ అభివర్ణించారు. డిసెంబర్ 9 నుంచి 18 వరకు రథయాత్రలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎంబిసి జాతీయకమిటీ అధ్యక్షుడు యువి చక్రవర్తి మాట్లాడుతూ కాపులను బిసి జాబితాలో చేర్చాలనే యోచన రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమన్నారు. బిసి విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పరిశా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సిఎం చంద్రబాబుకు గుణపాఠం చెప్పేందుకు బిసిలంతా సిద్ధం కావాలన్నారు. బిసి మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నూకాలమ్మ మాట్లాడుతూ బిసి జాబితాలో కాపులను చేర్చేందుకు సిద్ధమైన సిఎం చంద్రబాబుకు గుణపాఠం నేర్పేందుకు తెలుగుదేశంపార్టీ బీసీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని కోరారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల బ్రహ్మయ్య మాట్లాడుతూ బిసి ప్రజలు గ్రామాల్లో చైతన్య యాత్రలు చేపట్టాలన్నారు. ముస్లిం హక్కుల పొరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖాజావలి మాట్లాడుతూ బిసి సంఘాల కార్యాచరణకు ప్రతి గ్రామంలో ముస్లింలు అండగా నిలుస్తారన్నారు.