బిజినెస్

కెటిపిపి ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, జనవరి 24: వరంగల్ జిల్లాలోని 500 మెగావాట్ల కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కెటిపిపి)లో ఆదివారం తెల్లవారుజాము నుండి విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. మొదటి దశ వార్షిక మరమ్మతుల నిమిత్తం గత ఏడాది డిసెంబర్ 28న ప్లాంట్‌ను నిలిపివేసి ఓవరాయలింగ్ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయతే మొదటి 15 రోజుల్లో మరమ్మతులు పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ, వివిధ కారణాలతో మరో 10 రోజలపాటు మరమ్మతులు కొనసాగాయ. ఈ క్రమంలో మరమ్మతులు పూర్తికావడంతో అధికారులు శనివారం లైటాఫ్ చేయగా, సాయంత్రం సింక్రనైజేషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆదివారం తెల్లవారుజాము నుండి కెటిపిపిలో విద్యుదుత్పత్తి ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ మరమ్మతుల్లో ఇతర ప్రాజెక్ట్‌ల నుండి వచ్చిన ఇంజనీర్లతోపాటు అనుభవజ్ఞులైన బిహెచ్‌ఈఎల్ ఇంజనీర్లు పాల్గొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.