రాష్ట్రీయం

జీవిత ఖైదీలకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

400 మందికి రిపబ్లిక్ డే కానుక

విజయవాడ, జనవరి 25: 2013 తరువాత సత్ప్రవర్తన కలిగిన 400మంది జీవిత ఖైదీలను రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం రాత్రి ఇక్కడి సిఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని 161వ అధికరణం ప్రకారం ఈ నిర్ణయం అమలుకు గవర్నర్‌ను కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. నిర్ణయం తీసుకున్న మరుక్షణంలోనే హోంశాఖ జీవో 9ని విడుదల చేసింది. సోమవారం రాత్రి దాదాపు ఆరు గంటలకుపైగా వాడివేడిగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశ వివరాలను రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు మీడియాకు వెల్లడించారు. ఈనెల 31న పదవీ విరమణ చేయనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాష్ట్రానికి చేసిన సేవలను సిఎం సహా మంత్రివర్గం కొనియాడింది. ఆయన సేవలను ఇతరత్రా రూపంలో ముందుముందు రాష్ట్భ్రావృద్ధికి వినియోగించుకునేందుకు చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రధానంగా విద్యుత్ రంగంలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపినందుకు మంత్రివర్గం ఆయనను ప్రశంసించింది. రాష్ట్రాన్ని కరవురహితంగా మార్చేందుకు పోలవరం, హంద్రీ- నీవా, గాలేరు- నగరి, గుండ్లకమ్మ, తోటపల్లి ప్రాజెక్టులను పూర్తిచేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. మార్చి నెలాఖరులోపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, నాబార్డు, ఎంపిపిల నిధులు, ఇతరత్రా నిధులతో 4400 కి.మీల మేర శివారు గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్ అండ్ బి రోడ్లన్నిటికీ మరమ్మతులు చేయాలని, నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా కరవు నివారణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
విశాఖ జిల్లా బక్కనపాలెం గ్రామంలో శృంగేరీ, శంకర మఠానికి 3.70 సెంట్లు, చిత్తూరు జిల్లా కెవిపి మండలం పెరిందేశింగ్ గ్రామంలో ఆదిత్యా స్పిన్నర్స్ లిమిటెడ్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి 5.20 సెంట్లు, అనంతపురం జిల్లా కుటాగుళ్ల గ్రామంలో బ్లూమూన్ ఎడ్యుకేషన్ సొసైటీకి 2.5 ఎకరాలు, నెల్లూరు జిల్లా తమ్మినిపట్నం గ్రామంలో మీనాక్షి ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 30 ఎకరాల భూమిని రూ.3నుండి 5లక్షల మధ్య ధరకు కేటాయిస్తూ నిర్ణయించారు. అనంతపురం జిల్లా ఎంపి కుంట గ్రామంలో నెడ్‌క్యాప్ ఆల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టుకు 873 ఎకరాలను ఎకరాకు రూ.20వేలు చొప్పున కేటాయించేందుకు ఆమోదించారు. కడప జిల్లా గోవిందపల్లి, బొమ్మవారిపల్లి గ్రామాల్లో ఎపిఎఫ్‌డిసికి 508 ఎకరాలు, విశాఖ జిల్లా పల్లివాకపాడు గ్రామంలో నేవల్ ఆల్టర్నేట్ బేస్ ఏర్పాటుకు ఎకరం రూ.5లక్షలు చొప్పున 1071 ఎకరాలు, విశాఖ జిల్లా రాజుపల్లె గ్రామంలో ఎకరం రూ.20లక్షలు చొప్పున ఎక్సైజ్ కస్టమ్స్ కార్యాలయ భవనాలకు 2ఎకరాలు, విజయనగరం జిల్లా పువ్వాన అగ్రహారంలో ఫార్మాస్యూటికల్ నానో కార్బన్ తయారీ యూనిట్‌కు ఎకరా రూ.6లక్షల చొప్పున 17.65 ఎకరాలు, నెల్లూరు జిల్లా కొత్తపట్నంలో ఎపిఎస్‌ఐసికి కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎకరా రూ.5లక్షల చొప్పున 46 ఎకరాలు కేటాయించటానికి నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గిరిజనులు కోరిన విధంగా రూ.55కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ పంపిన విడుదలకు అర్హత కలిగిన ఖైదీల జాబితాను పరిశీలించి ఇందుకోసం నియమించిన స్టాండింగ్ కమిటీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం 400 మంది ఖైదీలతో కూడిన తొలి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో 30ఏళ్ల నుంచి 60ఏళ్ల వరకు వయస్సు కలిగి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీల విడుదలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర విభజనానంతరం రాజధాని విజయవాడకు మారిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాహితం దృష్ట్యా తీసుకున్న కీలక నిర్ణయంగా దీన్ని భావించాల్సి వుంటుంది. ఈ నిర్ణయంతో విడుదలకానున్న 400 మంది ఖైదీల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తనున్నాయి.
పౌరసరఫరాల శాఖ తీరుపై ఆగ్రహం
సంక్రాంతి సందర్భంగా చంద్రన్న కానుకల పంపిణీలో నాసిరకం సరుకులు చోటుచేసుకున్నాయనే అభియోగంతో ప్రభుత్వం పరువు పోయిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పౌరసరఫరాల శాఖ తీరుపై మండిపడ్డారని తెలిసింది. వివిధ శాఖలపై తరచూ ఫిర్యాదులు చేస్తున్న కార్మిక మంత్రి అచ్చెన్నాయుడును ఆయన మందలించినట్లు తెలిసింది.