తెలంగాణ

జనసంద్రమైన నారాయణఖేడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 25: అభివృద్ధి మంత్రంతో జనం ముందుకెళ్లి మద్దతు కూడగట్టాలని నాలుగైదు మాసాలుగా అధికార టిఆర్‌ఎస్ పార్టీ వేసిన ఎత్తుగడలకు చక్కని ఫలితం వచ్చినట్లు మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో సోమవారం నాటి టిఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం ద్వారా స్పష్టమవుతోంది. నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లోని 200 గ్రామాల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. పట్టణంలో ఎటుచూసినా గులాబీ కండువాలే కనిపించాయ. మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని గ్రామాల నుంచి తరలించిన జనాన్ని ఊరు శివారులో ఉన్న రహమాన్ ఫంక్షన్‌హాల్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు బ్యాండు మేళాలు, డప్పు చప్పుళ్లతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఓపెన్ టాప్ జీపుపై మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపి బిబి పాటిల్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబుమోహన్, రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థి ఎం.్భపాల్‌రెడ్డిని వేలాది మంది కార్యకర్తల మధ్య ఊరేగింపును నిర్వహించారు. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైందే తడవుగా జిల్లా నలుమూలల నుంచి టిఆర్‌ఎస్ ముఖ్య నాయకులంతా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని గ్రామాల్లో మకాం వేసారు. రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మంగల్‌పేట బస్టాండ్ వరకు ప్రధాన రహదారిపై జనం కిక్కిరిసిపోయారు. తరలివచ్చిన జనాన్ని చూసి మంత్రి హరీష్‌రావుతో పాటు టిఆర్‌ఎస్ శ్రేణులంతా గెలుపు ఖాయమే అన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల నుంచి డిసిఎంలు, లారీలు, జీపులు, ఆటోలు, బైకులపై ప్రజలను తరలించడంతో పట్టణంలో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ జాం కావడంతో ఆర్టీసీ బస్సులు కొన్ని మంగల్‌పేట బస్టాండ్ నుంచి తిరిగి వెళ్లిపోవడంతో రాజీవ్ చౌక్ వద్ద బస్సుల కోసం వేచిచూసిన ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.