మెదక్

జిల్లా పరిధిలో రెండు డివిజన్లలో గులాబీ గుబాళింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 5: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ పార్టీకి జిల్లాలోని రెండు స్థానాల్లో ప్రజలు సంపూర్ణ మద్దతు పలికి గ్రేటర్ సభలోకి పంపించారు. 150 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి పటన్‌చెరులో ఓటర్లు మద్దతు పలికి హైదరాబాద్‌లోనే ఏకైక విజయాన్ని అందించడం విశేషం. గెలుపు కోసం జతకట్టిన టిడిపి-బిజెపి ఉమ్మడి అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురైంది. స్థానికేతరులు అధికంగా ఉన్న పారిశ్రామిక వాడపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టిడిపికి ఘోర పరాభవం ఎదురు కావడంతో ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పక్షం రోజుల పాటు ఓటర్ల ముందు అన్ని పార్టీల అభ్యర్థులు మోకరిల్లినా ఓటర్లు మాత్రం తీర్పును ఏకపక్షంగా ఇవ్వడం విశేషం. పటన్‌చెరు కాంగ్రెస్, రామచంద్రాపూర్ టిఆర్‌ఎస్, భారతీనగర్ డివిజన్లను బిజెపి గెలుచుకుంటుందని రాజకీయ విశే్లషకులు స్పష్టం చేసినా భారతీనగర్‌లో బిజెపికి ఎదురు దెబ్బ తగలడం గమనార్హం. ఇక్కడ టిడిపితో పొత్తు పొసగకపోవడంతో ఇద్దరు అభ్యర్థులు స్వతంత్రంగా బరిలోకి దిగడం వల్లనే బిజెపి ఓటమి నుంచి తప్పుకోలేకపోయింది. మెదక్ జిల్లా ప్రజాప్రతినిధుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపాల్‌రెడ్డి తన కోడలను గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డినా మెజార్టీ మాత్రం అనుకున్నంతగా సాధించుకోలేకపోయారు. భారతీనగర్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థికి 8926 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థికి 8758 ఓట్లురాగా టిఆర్‌ఎస్ అభ్యర్థి 168 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రామచంద్రాపూర్ డివిజన్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థికి 1053 ఓట్లు రాగా టిడిపి అభ్యర్థికి 5242 ఓట్లురాగా 5288 ఓట్ల భారీ మెజార్టీతో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. యావత్ గ్రేటర్‌లోనే ఏకైక స్థానాన్ని సంపాదించుకున్న పటన్‌చెరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 9316 ఓట్లురాగా టిఆర్‌ఎస్ అభ్యర్థికి 7930 ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్ అభ్యర్థి 1386 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సెటిలర్లు గిటిలర్లు జాన్‌తా నై అన్నట్లుగా తాము స్థానికులమే అన్న భావనతో ఇక్కడి స్థానికేతర ఓటర్లు సైతం టిఆర్‌ఎస్ పార్టీవైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. పటన్‌చెరులో కాంగ్రెస్ గెలుపుకు పార్టీపై ఉన్న విశ్వాసం కాదని కేవలం అభ్యర్థి శంకర్ యాదవ్ వ్యక్తిత్వానికే ఓటర్లు పట్టం కట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలోని రెండు డివిజన్లతో పాటు హైదరాబాద్‌లో అత్యధిక స్థానాల్లో గులాబి గుబాళింపుకు టిఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరిసింది. జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట మున్సిపాలిటీలు, గజ్వేల్, జోగిపేట నగర పంచాయతీలు, అన్ని మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో టిఆర్‌ఎస్ శ్రేణులు విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చుతూ మిఠాయిలు పంపిణీ చేసారు. మొత్తంమీద గ్రేటర్ ఎన్నికల ఘన విజయంతో టిఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణకిసలాడుతోందని చెప్పవచ్చు.

టిఆర్‌ఎస్ విజయోత్సాహం
సంగారెడ్డి టౌన్, పిబ్రవరి 5: గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించడంతో శుక్రవారం సాయంత్రం జిల్లాకేంద్రంలో పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు టపాసులను కాల్చి, స్వీట్లను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు ప్రభుత్వ పనితీరుకు గ్రేటర్ ఎన్నికలే నిదర్శనమన్నారు. నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానాన్ని టిఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. విజయానికి సహకరించిన గ్రేటర్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు ప్రభాకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి నర్సింలు, నాయకులు వెంకటేశం, శ్రీనివాస్, మందుల రాధాకృష్ణ, జలేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మహిళ దారుణ హత్య
* అత్యాచారం చేసి, బంగారు ఆభరణాలు దోచుకున్నట్లు అనుమానాలు
* మృతదేహాన్ని తగులబెట్టిన దుండగులు
* నిందితుల కోసం గాలిస్తున్న
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు
మెదక్, మెదక్ రూరల్, ఫిబ్రవరి 5: సుమారు 32 సంవత్సరాల గృహిణిని అతి దారుణంగా హత్య చేయడమే కాకుండా దహనం చేశారు. గురువారం రాత్రి మెదక్ మండలం శాలిపేట గ్రామ శివారు అడవిలో జరిగిన ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే మెదక్ డిఎస్పీ జి.రాజారత్నం, సిఐ రామకృష్ణ, క్ల్యూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్‌లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమె శరీరంపై పుస్తెలతాడు, కమ్మలు, మాటీలు తదితర బంగారు నగలున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. హత్యకు ముందు మహిళ అత్యాచారానికి గురైనట్లు అనుమానాలున్నాయ. డిఎస్పీ రాజారత్నం కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జోగిపేట మండలం అక్సాన్‌పల్లి గ్రామానికి చెందిన అనిత (32)కు సదాశివపేటకు చెందిన నగేష్‌గౌడ్‌తో వివాహం జరిగింది. నగేష్‌గౌడ్ 10 సంవత్సరాల క్రింద మరణించాడు. ఈ దంపతులకు కుమార్తె హిందు(12) ఉంది. సదాశివపేట అత్తగారి ఇంటిలో భర్త నగేష్‌గౌడ్ చనిపోవడంతో తిరిగి తల్లిగారు ఉంటున్న జోగిపేట మండలం అక్సాన్‌పల్లిలో అనిత ఉంటూ వచ్చింది. లింగంపేట మండలం ఎక్కపల్లి గ్రామంలో చెల్లెలు లలి, అక్క అనితతో మాట్లాడి బంగారం లాంగ్ చైన్ చేయించుకొని రమ్మని చెప్పింది. దీంతో బంగారం లాంగ్ చైన్‌ను చేయించుకొని అనిత జోగిపేట బస్టాండ్‌లో బస్సు ఎక్కింది. అక్కడి నుంచి కొంత దూరం వచ్చాక బస్సు చెడిపోయిందని ఒక ఆటోలో అనిత ఎక్కింది. సాయంత్రం 5:30 గంటల సమయంలో అనితకు అక్క లలిత ఫోన్ చేసింది. మెదక్‌కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను, త్వరగా వస్తానని అనిత తెలిపింది. ఫోన్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఆటో డ్రైవర్‌కు ఫోన్ ఇచ్చి మాట్లాడిచ్చింది. ఆటో డ్రైవర్ కూడా మెదక్ పట్టణానికి అతి సమీపంలో ఉన్నాము. త్వరగా వస్తామని తెలిపారు. సాయంత్రం 5:30 గంటలకు మాట్లాడిన ఫోన్ కట్ అయింది. ఆ తరువాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ మెదక్ మండలం శాలిపేట బస్టాండ్ సమీపానికి కొంత దూరంలో అటవీ ప్రాంతంలో పెట్రోల్‌తో కాలబెట్టిన అనిత శవం కనిపించింది. అనిత వద్ద ఒక సంచిలో బంగారం లాంగ్‌చైన్ ఉంది. ఆ సంచి కొంత దూరంలో పడి ఉంది. ఆ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు అభరణాలు దుండగులు దోచుకున్నారు. ఆమె శవం ప్రక్కన అరటిపండ్లు ఉన్నాయి. కొంగు ఉంది, లాంగ్ బంగారం చైన్ కూడా ఒక సంచిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మహిళను దారుణంగా చంపి పెట్రోల్‌తో కాల్చి చంపారు. ఈ విషయాన్ని మెదక్ డిఎస్పీ రాజారత్నం ధ్రువీకరించారు. ఒక వ్యక్తితో కాదు, ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఈ దురాగతానికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలంలో ఉన్న పరిస్థితులనుబట్టి ఆమెపై అత్యాచారం చేసి, ఒంటిపై ఉన్న బంగారు ఆభణాలను అపహరించి, చివరకు పెట్రోల్ పోసి దగ్ధం చేశారని తెలుస్తోంది.
* స్నేహితుల ద్వారానే అనిత ఘోర సంఘటన
* మెదక్ డిఎస్పీ రాజారత్నం
మెదక్ మండలం శాలిపేట శివారులో గురువారం శుక్రవారం మధ్యరాత్రిలో జరిగిన మహిళ హత్య సంఘటన ఆమె స్నేహితుల ద్వారానే జరిగి ఉండవచ్చునని భావిస్తున్నట్లు మెదక్ డిఎస్పీ రాజారత్నం తెలిపారు. మెదక్‌కు 4 కిలోమీటర్ల దూరంలో సాయంత్రం 5:30 గంటలకు అనితతో తన చెల్లెలు లలిత ఫోన్‌లో మాట్లాడినప్పుడు అనిత లలితతో మాట్లాడి తిరిగి ఆటో డ్రైవర్‌తో మాట్లాడిపించింది. అది చివరి ఫోన్. ఆ తరువాత జరిగిన సంఘటనల మధ్య అనిత ఘోర ప్రమాదానికి గురైంది. శవం వద్ద ఉన్న బంగారు లాంగ్ చైన్ లభించినట్లు డిఎస్పీ రాజారత్నం తెలిపారు. డాగ్ స్క్వాడ్, క్ల్యూస్ టీమ్‌లను రప్పించడమే కాకుండా సిసి కెమెరాల ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నంలో ఉన్నామని డిఎస్పీ తెలిపారు. ఈ సంఘటన స్థలంలో సిఐ రామకృష్ణ, ఎస్సై సంతోష్‌కుమార్, క్ల్యూస్ టీమ్, డాగ్ స్క్యాడ్‌లు ఉన్నాయి. త్వరలో నిందితులను పట్టుకుంటామని డిఎస్పీ రాజారత్నం వెల్లడించారు.

బాలికల ఆరోగ్య రక్షణపై ప్రత్యేక శ్రద్ధ

* మెరుగైన వైద్య సేవలు అందించాలి
* ఆర్‌బిఎస్‌కె పథకంపై సమీక్షలో అధికారులకు సిఇఓ సూచన
సంగారెడ్డి టౌన్, పిబ్రవరి 5: రాష్ట్రీయ బాల స్వాస్త్య (ఆర్‌బిఎస్‌కె) కార్యక్రమాన్ని జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పరిషత్ సిఈఓ వర్షిణి అన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సూపరింటెండెంట్లు, ఉద్యోగులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరు వారాల చిన్నారుల నుండి 18యేళ్ల వయస్సు లోపు బాల బాలికలకు మొబైల్ హెల్త్ టీంల ద్వారా పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేని వ్యాధి నివారణ చికిత్సలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం తమ తమ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా పేద విద్యార్థులకు ఖర్చు లేని వైద్యం అందించాలని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు గతంలో కంటే చాల తగ్గాయని, వైద్యాధికారులు, ఎస్‌పిహెచ్‌ఓలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరిగేలా కృషి చేయాలన్నారు. కలెక్టర్ ప్రతిష్టాత్మంకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిఎంఅండ్‌హెచ్‌ఒ అమర్‌సింగ్ వైద్యులు, సిబ్బందికి సూచించారు. ఎన్‌హెచ్‌ఎం డిపిఓ జగన్నాథరెడ్డి, వైద్యులు హిరణ్మయి, శాశంక్, పలువురు వైద్యులు, స్ట్ఫా నర్సులు పాల్గొన్నారు.
బకాయి వేతనాలు చెల్లించాలంటూ
మున్సిపల్ కార్మికుల ధర్నా
సంగారెడ్డి టౌన్, పిబ్రవరి 5: సంగారెడ్డి మున్సిపల్ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించడంతో పాటు వేతనంలో మినాహాయించిన పిఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మున్సిపల్ ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి మున్సిపల్‌కు అడిషనల్ డైరెక్టర్ వాణిశ్రీ వచ్చిన సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ప్రవీన్ మాట్లాడుతూ గత ఐదు మాసాలుగా వేతనాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతి మాసం పిఎఫ్, ఇఎస్‌ఐ కట్ చేస్తున్న కార్మికుల ఖాతాల్లో జమ చేయడం లేదని ఆరోపించారు. కార్మికులు మృతి చెందితే అంత్యక్రియలకు ఇవ్వాల్సిన రూ.10వేలు సైతం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలో 15మంది కార్మికులు ఇప్పటి వరకు మృతి చెందితే వారి కుటుంబాలకు పిఎఫ్‌తో పాటు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని ఆరోపించారు. ఈ నెల 10లోగా సమస్యలు పరిష్కరించాలాన్నారు. స్పందించిన ఎడి వాణిశ్రీ ఒక నెల వేతనాన్ని వెంటనే చెల్లిస్తామని, దశల వారిగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామి ఇచ్చారు. ధర్నాలో సిఐటియు పట్టణ కార్యదర్శి మహబూబ్‌ఖాన్, మహేష్, మోహన్, నర్సింగ్‌రావు, శ్రీశైలం, సెల్వారాజ్, శివరాజ్, రాములు, ప్రభాకర్, అనీల్, వేణు, కుమార్ పాల్గొన్నారు.
ప్రజలను మోసగిస్తున్న తెరాస ప్రభుత్వం

* మాజీ ఉపముఖ్యమంత్రి
దామోదర్ రాజనర్సింహ
పెద్దశంకరంపేట, ఫిబ్రవరి 5: మోసపూరిత మాటలతో ప్రజలను మోసగిస్తూ తెరాస ప్రభుత్వం పరిపాలిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ్మా అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బుజ్రాన్‌పల్లి, వెంకటపూర్, టెంకటి, జంబికుంట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవరెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర్ మాట్లాడుతూ తెలంగాణ పేరుతో రాజకీయ లబ్దిపొంది ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోగబుచ్చుతున్న పార్టీ తెరాస అన్నారు. ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి ఎన్నో వాద్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదన్నారు. ఇంటింటి ఒక ఉద్యోగం అన్ని తెరాస, ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. రైతు రుణమాఫికి 18 కోట్లు లేవన్న ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పేరుతో 36 వేల కోట్లతో పైపులు ఎలా కొనుగోలు చేశారని ఆయన ప్రశ్నించారు. రైతు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత తెరాసకు లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంభాలను పరమార్శించే తీరిక లేని ముఖ్యమంత్రికి రైతుల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదన్నారు. మాట ఇస్తే నిలబెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని, తెరాస 20 నెలల పాలనపై ఖేడ్‌లో బహిరంగ చర్చకు తాము సిద్దమని, ఇందుకు తెరాస సభ్యులు సిద్దమా అని ఆయన ప్రశ్నించారు. జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, బహిరాబాద్ మాజీ ఎంపి సురేష్ షేట్కార్, పేట ఎంపిపి రాయిని సంగమేశ్వర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్ష్మీనారాయణ, రాజేందర్‌గౌడ్, జనార్దన్, పెరుమల్లుగౌడ్, సురేంద్ర తదితరులు ఉన్నారు.

పటన్‌చెరు డివిజన్
కాంగ్రెస్ కైవసం

పటన్‌చెరు, ఫిబ్రవరి 5: పటన్‌చెరు డివిజన్ కాంగ్రెస్ పార్టీ కైవసమైంది. పార్టీ అభ్యర్థి శంకర్‌యాదవ్ కార్పొరేటర్ గెలుపొందారు. అధికార పార్టీని రెండవ స్థానంలోకి నెట్టిన ఆయన 1386 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి రాజబోయిన కుమార్‌యాదవ్‌కు 7930 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి శంకర్‌యాదవ్‌కు 9316 ఓట్లు దక్కాయి. మిత్రపక్షాల అభ్యర్థులు మూడవ, నాలుగవ స్థానాలతో సరిపెట్టుకున్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో సరైన అవగాహన కుదరకపోవడంతో టిడిపి, బిజెపి అభ్యర్థులు రంగంలో నిలిచారు. మూడవ స్థానంలో నిలిచిన టిడిపి అభ్యర్థి మెట్టుకుమార్‌యాదవ్ 3392 ఓట్లు దక్కించుకోగా నాలుగవ స్థానంతో సరిపెట్టుకున్న బిజెపి అభ్యర్థి దేవెందర్‌రాజుకు 3183 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు సంధర్బముగా పటన్‌చెరు డివిజన్‌కు ఎనిమిది రౌండ్లు ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి శంకర్‌యాదవ్ మొదటి రౌండు నుండి అధిక్యత ప్రదర్శించారు. ఒకటవ రౌండ్‌లో 708 ఓట్ల అధిక్యతతో దూసుకుపోయిన శంకర్‌యాదవ్ చివరి వరకు కొనసాగించారు. రెండవ రౌండులో 652 ఓట్ల మెజారిటి సాధించారు. ఈ క్రమంలో నాలుగవ రౌండు వరకు 2540 ఓట్ల అధిక్యతో ఉన్న ఆయన చివరి ఎనిమిదవ రౌండు ముగిసేలోగా 1386 మెజారిటి సొంతం చేసుకున్నారు.
జీవితాంతం ఋణపడి ఉంటా; శంకర్‌యాదవ్
అత్యిధిక మెజారిటితో కార్పొరేటర్‌గా గెలిపించిన పటన్‌చెరు డివిజన్ ప్రజలకు జీవితాంతం ఋణపడి ఉంటానని శంకర్‌యాదవ్ అన్నారు. గతంలో సర్పంచ్‌గా అందించిన సేవలు గుర్తించిన ప్రజలు తనకు పట్టం కట్టారన్నారు. ప్రజల పక్షాన నిలబడి నిరంతరము వారికి సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. తన విజయం కోసం అహర్నిశలు శ్రమించిన మైనారిటీలు, యువకులు, ఎస్‌టి, ఎస్‌టి, బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. పట్టణంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఆర్‌సిపురంలో
టిఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ

పటన్‌చెరు, ఫిబ్రవరి 5: పటన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని మూడు కార్పొరేటర్ డివిజన్లకు గాను రెండు డివిజన్లలో అధికార టిఆర్‌ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. రామచంద్రాపురం, భారతినగర్‌లలో టిఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. రామచంద్రాపురం డివిజన్‌లో ఏకపక్షంగా సాగిన ఎన్నికలలో భారీ మెజారిటి అధికార పార్టీ సొంతమైంది. టిఆర్‌ఎస్ అభ్యర్థి తొంట అంజయ్య సమీప ప్రత్యర్థి టిడిపి అభ్యర్థి కరికె సత్యనారాయణయాదవ్‌పై 5591 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. తొంటఅంజయ్యకు 10833 ఓట్లు రాగా టిడిపి సత్యనారాణయకు 5591 ఓట్ల వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి తాళ్ల అవినాష్‌గౌడ్ 3193 ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు. రామచంద్రాపురం ఓట్ల లెక్కింపులో మొదటి రౌండు నుండి భారీ అధిక్యతను చాటిన తొంటఅంజయ్య చివరి రౌండు వరకు అదే ఊపును కొనసాగించారు.
భారతినగర్ డివిజన్‌లో
టిఆర్‌ఎస్‌కు స్వల్ప అధిక్యం
రామచంద్రాపురం డివిజన్‌ను భారీ మెజారిటితో కైవసం చేసుకున్న టిఆర్‌ఎస్ భారతినగర్ డివిజన్‌ను మాత్రం స్వల్ప అధిక్యతతో స్వాధీనం చేసుకుంది. అధికార పార్టీ అభ్యర్థి సింధు ఆదర్శరెడ్డి 168 ఓట్లతో సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి చిన్నమోళ్ల గోదావరిపై 168 ఓట్లతో గెలుపొందారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి సింధుకు 8926 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి గోదావరికి 8758 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన అంకెనగారి శ్రీలత 1161 ఓట్లు దక్కించుకుని మూడవ స్థానంలో నిలబడ్డారు.

అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలి

రోడ్‌షోలో మంత్రి హరీష్‌రావు
నారాయణఖేడ్ ఫిబ్రవరి 5: నారాయణఖేడ్ నియోజక వర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలో టిఅర్‌ఎస్ అభ్యర్థి ఎం, భూపాల్‌రెడ్డి భారీ మేజార్టీతో గెలిపించాలని ఎంతో ఎక్కువ మేజార్టీ ఇస్తే అంత అభివృద్ది చేసేందుకు అవకాశం ఉంటుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీస్‌రావు ఓటర్లకు పిలుపు నిచ్చారు. శుక్రవారంనాడు ఖేడ్ మండలంలో పరిధిలోని అనంతసాగర్, సత్యగామ, చందాపూర్ జూకల్ గ్రామాంలో జరిగిన ఉప ఎన్నికల రోడ్ షో సభలో మంత్రి మాట్లాడుతూ గత అరు నెలలుగా ఖేడ్‌లో 400 కోట్ల రుపాయలు మంజూరుతో అన్ని శాఖలో మంజూరైన పనులు జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఖేడ్‌లో విద్యార్థులకు ఫీజీ కాలేజి ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటికే రైతుల కోసం మార్కెట్ యార్డు, 12 విద్యుత్తు సబ్‌స్టేషన్లు మంజూరు చేసి నిర్మాణం జరుగుతున్నాయని అందులో ఐదు వరకు 60 రోజులో నిర్మించి ప్రారంభించామని తెలిపారు. 10 కోట్ల రుపాయలతో అన్ని వర్గాలకు చెందిన వారికి కమ్యూనీటీ భవనాలు మంజూరు చేసి పనులు కొసాగుతున్నాయని అన్నారు. ఖేడ్ 150 పడుకల ఆసుపత్రి మంజూరు చేసి శంకుస్థాపనతో పాటు పనులు నడుస్తున్నాయని చెప్పారు. 786 కోట్లతో మీషన్‌భగీరథ పథకం కింద ఇంటింటికీ నల్లా ఇచ్చేందుకు పనులు జరుగుతున్నాయని వచ్చే సంవత్సరంలో ఖేడ్ నియోజక వర్గంలో తాగునీరు అందిస్తామని తెలిపారు. ఖేడ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పదువులు పంచుకుని పేదల ఓట్లు వేసుకుని అస్తులను పెంచుకున్నారని అరోపించారు. టిడిపి కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్ గల్లంతు అవుతుందని అయన భరోసా ఇచ్చారు. ఇది పని ఎవరు చేస్తారని ఓటర్ల చేతిలో ఉందని అన్నారు. ఇప్పటికైన కాంగ్రెస్ , టిడిపి పార్టీలకు చెందిన నాయకులు ఇచ్చిన డబ్బులు తీసుకుని ఓటు మాత్రం టి అర్ ఎస్ పార్టీ కార్తుపై వేయాలని పిలుపు నిచ్చారు. ఖేడ్ మండలంలో జూకల్ గ్రామంలో మంత్రి హరీస్‌రావు మహిళలు మంగళరులతో బతుకామ్మలతో ఘన స్వాగతం పలికారు. ఎస్సీ కాలనీ నుండి గ్రామంలో వరకు భారీ ర్యాలీ కొసాగించారు. జూకల్ గ్రామంలో స్వాగతం పలికిన తీరు పరిశీలించిన మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో ఎంపి బిబిపాటిల్, అభ్యర్థి ఎం, భూపాల్‌రెడ్డి ఎమ్మెల్యే బాబుమోహన్, సర్పంచు బుజ్జిబాయి, ఉపా సర్పంచు సంగమ్మ, టి అర్‌ఎస్ నాయకులు న్యాయవాది లక్ష్మన్‌రావు. దత్తరా రాజేందర్‌రావుపటేల్, అంజయ్య,మనోహర్‌రావు, తుర్కాపల్లి రాజు, రవిపటేల్, రాజుపటేల్, తొట రాములు, నర్సింలు పాల్గొన్నారు.