క్రీడాభూమి

జాక్సన్ కీలక గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, ఫిబ్రవరి 14: కెప్టెన్ ఆష్లే జాక్సన్ కీలక గోల్ చేసి, దబాంగ్ ముంబయితో ఆదివారం జరిగిన హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో రాంచీ రేస్‌ను గెలిపించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ కొనసాగిన ఇరు జట్ల మితిమీరిన రక్షణాత్మక విధానం ప్రేక్షకులను అసహనానికి గురి చేసింది. 35వ నిమిషంలో జాక్సన్ గోల్ చేయడాన్ని మినహాయిస్తే, ఈ మ్యాచ్ ఏ దశలోనూ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. కాగా, ఈ విజయంతో మొత్తం 37 పాయింట్లకు చేరుకున్న రాంచీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.