క్రీడాభూమి

జ్యూరిచ్ చెస్ టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యూరిచ్, ఫిబ్రవరి 15: ప్రపంచ మాజీ చాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఇక్కడ జరుగుతున్న జ్యూరిచ్ చెస్ టోర్నమెంట్‌లో ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాడు. మొదటి రెండు గేమ్స్‌ను వరుసగా లెవన్ అరోనియన్, అనిష్ గిరిపై విజయాలను నమోదు చేసిన అతను మూడో రౌండ్‌లో అలెక్సీ షిరోవ్‌తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. నాలుగో రౌండ్‌లో అమెరికా ఆటగాడు హికారూ నాకమూరతో తలపడి డ్రాతో సంతృప్తి చెందాడు. రెండు వరుస విజయాలు, అనంతరం రెండు వరుస డ్రాలతో అతను మొత్తం ఆరు పాయింట్లు సంపాదించి, ఈ టోర్నీలో ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాడు.