కడప

జిల్లాకు ఉక్కుపరిశ్రమ వచ్చేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 22: రాష్ట్రంలో అత్యంత దుర్భక్ష ప్రాంతమైన కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ వస్తుందో, లేదోనని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో బ్రహ్మణి ఉక్కుపరిశ్రమ ప్రైవేట్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్మించేందుకు జమ్మలమడుగు నియోజకవర్గపరిధిలో శంకుస్థాపన జరిగింది. కోట్లాదిరూపాయలు ఖర్చుచేసి పలు నిర్మాణాలు కూడా చేపట్టారు. అనంతరం జరిగిన పరిణామాలతో బ్రహ్మణి ఉక్కుకర్మాగారం నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కుకర్మాగారాన్ని ఏర్పాటుచేస్తామని ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ నూతన ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా ఈ కర్మాగారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతుతున్నాయి. ఈ కర్మాగారం ఏర్పాటైతే దాదాపు 25వేల మందికి ప్రత్యక్షంగా, లక్షమందికి పరోక్షంగా జీవనోపాధి లభిస్తుంది. జిల్లాలోని నిరుద్యోగులతోపాటు ఇతర ప్రాంతాల్లోని కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ప్రస్తుతం ఎంతోమంది నిరుద్యోగులు రాయలసీమవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో దాదాపు లక్షమంది నిరుద్యోగులు ఈ ఉక్కుకర్మాగారంపై ఆశలు పెట్టుకున్నారు. వీరికి ప్రభుత్వ రంగంలో అవకాశాలు లేకపోవడంతో ఉక్కుకర్మాగారం ఏర్పాటైతే ఏదో ఒక ఉద్యోగం రాకపోతుందా అన్న ఆశతో ఉన్నారు. రాష్టవ్రిభజన సమయంలో కేంద్రం కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కుకర్మాగారాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. కడప సమీపంలోని కొప్పర్తి వద్ద ఈ పరిశ్రమను ఏర్పాటుచేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అనంతరం దాని ఊసేలేకుండా పోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికీ అనేకమార్లు జిల్లాకు వచ్చినా ఉక్కుకర్మాగారం ప్రస్తావనే తేలేదు. ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ్ జిల్లాకు వచ్చిన సందర్భంగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు జిల్లాలో ఉక్కుకర్మాగారాన్ని స్థాపించాలని వినతిపత్రాన్ని ఇచ్చారు. తాను ఈ విషయాన్ని ప్రధానమంత్రి, పరిశ్రమలశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ అయితే ఇచ్చారు. కానీ ఇంతవరకు రాష్ట్రప్రభుత్వం కానీ, అటు కేంద్రప్రభుత్వం కానీ ఆ ఊసే ఎత్తకపోవడంతో నిరుద్యోగుల్లో నిరాశ,నిస్పృహలు అలముకున్నాయి. జిల్లాలో ఉక్కుపరిశ్రమ స్థాపనకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సహకరించాలని నిరుద్యోగ యువత కోరుతోంది. ఇందుకోసం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, వివిధపార్టీల నాయకులు చిత్తశుద్ధితో కృషిచేయాల్సి ఉంది.