అంతర్జాతీయం

క్షమాభిక్ష తేలేవరకూ జాధవ్‌ను ఉరితీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 1: క్షమాభిక్ష కోసం భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ పిటిషన్లపై తుది నిర్ణయం తేలేవరకూ ఆయనను ఉరితీసేది లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. తుది తీర్పు వచ్చేవరకూ జాధవ్ జోలికెళ్లడానికి వీల్లేదంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో పాక్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ అయినప్పటి నుంచీ భారత్ మీడియాలో తప్పుడు ప్రకటనలు, వార్తలు, ఆరోపణలు వస్తున్నాయని పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి నఫీజ్ జకారియా అన్నారు. అంతర్జాతీయ కోర్టు స్టే ఇచ్చినప్పటికీ క్షమాభిక్ష కోరుకునే హక్కు జాధవ్‌కు ఉందని ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకూ అతడిని ఉరితీసేది లేదని చెప్పారు. ముందుకుగా సైనిక దళాల ప్రధానాధికారిని ఆ తరువాత పాకిస్తాన్ అధ్యక్షుడిని ఇందుకోసం అభ్యర్థించే అవకాశం జాధవ్‌కు ఉందన్నారు. వాస్తవం ఇలా ఉంటే అంతర్జాతీయ న్యాయస్థానంలో నెగ్గేసామంటూ భారత్ తప్పుడు వాదనను ప్రచారంలోకి తెస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో రెండు దేశాల ప్రజలను భారత్ తప్పుదోవ పట్టించిందని జకారియా అన్నారు. ఈ అంశంపై హేగ్ కోర్టులో జూన్ 8న పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని చెప్పారు. అత్యంత బలమైన రీతిలో కోర్టుకు తమ వాదనను వినిపించడమే కాకుండా జాధవ్ విషయంలో తమ అధికార పరిధిని కూడా స్పష్టం చేశామని అన్నారు.