హైదరాబాద్

జోరుగా అభ్యర్ధుల ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, జనవరి 22: తెరాసలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని లింగోజిగూడ టిఆర్‌ఎస్ అభ్యర్థి ముద్రబోయిన శ్రీనివాసరావు అన్నారు. బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. శుక్రవారం లింగోజిగూడ డివిజన్ పరిధిలోని తపోవన్‌కాలనీ, మజీద్‌బస్తి తదితర ప్రాంతాలలో ఆయన జోరుగా ప్రచారం చేశారు. డివిజన్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావాలంటే అది తెరాస ప్రభుత్వానికే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్లారపు శాలిని, శ్రీహరి, శ్రీ్ధర్‌గౌడ్, మొగిలిపువ్వు నారాయణ, దర్శన్, రాంలక్ష్మణ్, కవిత, రజిత, విజయలక్ష్మి పాల్గొన్నారు.
లింగోజిగూడలో కాంగ్రెస్ విజయం ఖాయం
ఎల్బీనగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలే కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు దోహదం చేస్తాయని లింగోజిగూడ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కాలనీ సంక్షేమ సంఘాలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌లో నెలకొన్న ముంపు ప్రాంతాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. డివిజన్ ప్రజలు తనను గెలిపిస్తే నిత్యం వారికి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
ప్రజల మద్దతు టిఆర్‌ఎస్‌కే..
జవహర్‌నగర్, జనవరి 22: రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 18నెలల్లో ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని నేరేడ్‌మెట్ డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి కె. శ్రీదేవి అన్నారు. శుక్రవారం జె.జె నగర్, వాయుపురి కాలనీ, సైనిక్‌పురి కాలనీలలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసముందని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు డబుల్ బెడ్ రూం, వికలాంగులకు పదిహేను వందలు, గ్రామాలలో కాకతీయ మిషన్, పనె్నండు వందల లోపు ఇంటి పన్ను పూర్తిగా మాఫీ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్ధిస్తూ పాదయాత్ర చేసారు. ఈ కార్యక్రమంలో గోపి రమణారెడ్డి, శంకర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, ఉమాదేవి, జానీ, శర్మ పాల్గొన్నారు.

టిఆర్‌ఎస్, బిజెపిలను నమ్మొద్దు
ఎల్‌బినగర్, జనవరి 22: గ్రేటర్ ఎన్నికల్లో తెరాస, బిజెపిలను నమ్మి ఓటు వేస్తే తమ ఓటు వృధా అవుతుందని ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి దేప సురేఖ భాస్కర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని గ్రీన్‌హిల్స్‌కాలనీలో పాదయాత్ర ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 18మాసాలు గడుస్తున్నా టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. గ్రేటర్‌లో కాంగ్రేస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.