జాతీయ వార్తలు

జమ్ముకశ్మీర్‌లో ఘర్షణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కీలక ఉగ్రవాది బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌లో హతమైన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో యువకులు పోలీసు పోస్ట్‌లు, సెక్యురిటీ సిబ్బందిపై దాడులకు దిగారు. శుక్రవారం రాత్రి అనంతనాగ్‌లోని కొకేర్‌నాగ్‌ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో బుర్హాన్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. శనివారం దాడుల్లో ముగ్గురు పోలీసులు సహా 11 మంది గాయపడ్డారు. కుల్గాంలోని భాజపా కార్యాలయంపైనా ఆందోళనకారులు దాడులు చేశారు. బందిపొరా, ఖాజిగండ్‌, లార్నో, అనంతనాగ్‌ తదితర ప్రాంతాల్లో పోలీసు చెక్‌పోస్ట్‌లపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే శ్రీనగర్‌ సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మొబైల్‌ ఇంటర్నెట్‌సేవలను నిలిపేశారు. అమర్‌నాథ్‌ యాత్రను కూడా తాత్కాలికంగా ఆపేశారు.