రాష్ట్రీయం

మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగన్‌కు వరద బాధితుల ఫిర్యాదు.. ప్రభుత్వ సాయంపై విమర్శలు

వెంకటగిరి, నవంబర్ 24: రాష్ట్రంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస పార్టీ అధికారంలోకి వచ్చేవరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పోరాటం తప్పదని ఆ పార్టీ అధ్యక్షులు వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి, బాధితులను పరామర్శించేందుకు సోమవారం రాత్రి నెల్లూరు జిల్లా వెంకటగిరి చేరుకున్న ఆయన మంగళవారం రాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదార్చారు. వెలంపాళెం నుంచి మొదలైన పర్యటన పోలేరమ్మగుడి, రాజవీది , కాశీపేట, పాత కైవల్యానది నుంచి పక్కన ఉన్న చింతచెట్టు ప్రాంతం చేరుకొని అక్కడ వర్షాలకు పూర్తిగా మునిగిపోయిన నిరుపేదల ఇళ్ళును పరిశీలించి బాధాతులను పరామర్శించారు. దీంతో అక్కడ నివసిస్తున్న మహిళలు వర్షాల్లో తడుస్తున్న తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇచ్చిన బియ్యంలో తూకం సక్రమంగా లేదని, అన్ని సరుకులు ఇవ్వలేదని అన్నారు. అడిగితే దౌర్జన్యం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు కట్టిస్తామన్నారు. పేదల కంట కన్నీరు రాకుండా చూస్తామన్నారు. మూడు సంవత్సరాలు పాటు ఓర్చుకోవాలని వారిని ఓదార్చారు. ఎం పి ఆధ్వర్యంలో అధికారుల తీరుపై, డీలర్లు చేస్తున్న నిర్వాకంపై, బాధితులను సాయం అందించేందుకు అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పారు. అక్కడ నుంచి కొత్త కైవల్యా వెంతెన పై తహశీల్దార్ కార్యాలయం, తూర్పువీధి, పాతబస్టాండు మీదుగా బిసి కాలనీకి చేరుకున్నారు. అక్కడ ఇంకా రోడ్ల పై నీళ్ళు ప్రవహిస్తున్నా నీళ్ళలోనే నడుచుకుంటూ ఇల్లుల్లు తిరిగారు. మగ్గం గుంటల్లో నీళ్ళు చేరాయని, దీంత మూడు నెలలు పాటు పనులు జరగవని జగన్ దృష్టికి తెచ్చారు. బియ్యం తప్ప ఎలాంటి సాయం అందలేదని చెప్పారు. ఇచ్చిన బియ్యం కూడా ఐదు రోజులు వస్తాయని తరువాత మా పరిస్ధితి ఏంటని బోరున విలపిస్తూ జగన్‌కు విన్న వించుకున్నారు.
(చిత్రం) వెంకటగిరి పట్టణంలో చేనేత కార్మికులను పరామర్శిస్తున్న జగన్