ఆంధ్రప్రదేశ్‌

చేనేత కార్మికులకు రూ.24వేల సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీ మంత్రివర్గ సమావేశం భేటీ ముగిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. చేనేత కార్మికులకు రూ.24వేల సాయం అందించాలని, ఈ సాయాన్ని డిసెంబర్ 21వ తేదీకి అందజేయాలని, ఏటా 90 వేల కుటుంబాలు లబ్ధిపొందుతాయని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం రూ.216 కోట్లు ఖర్చుఅవుతుందని అంచనా వేశారు. మత్స్యకార్మికులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయాన్ని రూ.10వేలకు పెంచాలని నిర్ణయించారు. అలాగే మత్స్యకారులకు డీజిల్‌పై రూ.9లు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీఎస్ ఆర్టీసీలో కాలం చెల్లిన 3500 బస్సులను తొలగించి కొత్త బస్సులు తీసుకోవాలని నిర్ణయం. మధ్యాహ్న భోజనం కార్మికుల వేతనం రూ.1000 నుంచి రూ.3000లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.