ఆంధ్రప్రదేశ్‌

ఇక అన్ని కార్డులు సచివాలయంలోనే:జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే అవినీతికి ఆస్కారం ఉండదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఈరోజు సచివాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఏర్పడిన గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు బలమైన కమ్యూనికేషన్ వ్యవస్థను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై రేషన్, పించన్, ఆరోగ్యశ్రీ ఫీజుల చెల్లింపు కార్డులన్నీ గ్రామ సచివాలయంలోనే అందజేస్తారని ఆయన తెలిపారు. అలాగే విశాఖ, తిరుపతి, అనంతపురంలలో కానె్సప్ట్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుచేసే సంస్థలకు చౌకగా భూమి, నీరు, విద్యుత్ ఇస్తామని తెలిపారు.