ఆంధ్రప్రదేశ్‌

మీ దీవెనలు కావాలి:జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల: నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు తమ కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. నాన్న తర్వాత మీరంతా వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఇలాగే మీ దీవెనలు, ఆశీస్సులు కావాలని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆయన శుక్రవారంనాడు పులివెందులలో ఎన్నికల ప్రచారం చేశారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్ర రైతాంగం రుణమాఫీ కాక అల్లాడిపోతుందని అన్నారు. పూర్తికాని ప్రాజెక్టులు, ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారని అన్నారు. కుప్పంకు ఏమీ చేయలేని చంద్రబాబు పులివెందులకు ఏదోచేస్తానని వాగ్ధానాలు చేస్తున్నారని విమర్శించారు. కడపు స్టీల్‌ప్లాంట్‌ను చంద్రబాబు అధికారంలో ఉండి కూడా ఎందుకు పూర్తిచేయలేదని అన్నారు.