రాష్ట్రీయం

ఒక్క వాగ్దానమైనా అమలు చేశారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రబాబుకు జగన్ బహిరంగ లేఖ
15 ప్రశ్నలు సంధించిన వైకాపా అధినేత
మూడో విడత జన్మభూమిలో ప్రభుత్వాన్ని నిలదీద్దామని పిలుపు

హైదరాబాద్, డిసెంబర్ 31: ఆంధ్ర రాష్ట్రంలో జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మూడవ విడత జన్మభూమి కార్యక్రమంలో సిఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని, ప్రశ్నించాలని ప్రతిపక్షనేత, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మొదటి రెండు విడతల జన్మభూమిలో 28.52 లక్షల ఫిర్యాదులు, సమస్యలు పెండింగ్‌లో ఉన్నా, ఇంతవరకూ వాటిని పరిష్కరించలేదన్నారు. ఆడిన మాట తప్పనివాడు హరిశ్చంద్రుడని, ఆడిన ప్రతి మాట తప్పినవాడు అబద్ధాల చంద్రబాబు అని ఆయన ఎద్దేవా చేశారు. మూడో విడత జన్మభూమి పేరిట డ్రామాలాడేందుకు వచ్చినప్పుడు ప్రజలు ఈ కింది 15 ప్రశ్నలు అడగాలని ఆయన కోరారు.
ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేశారా, కనీసం వడ్డీ అయినా మాఫీ అయిందా, డ్వాక్రా రుణాలు మాఫీ అయ్యాయా, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని , నిరుద్యోగికి నెలకు రెండు వేల భృతి ఇస్తామన్న హామీ ఏమైందని అడగాలన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించారా, హోంగార్డులు, అంగన్‌వాడీ టీచర్లు, విద్యావలంటీర్ల సేవలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకున్నారా అని అడిగారు. బెల్ట్‌షాపులు రద్దు చేశారా, పేదలందరికీ మూడు సెంట్ల భూమిలో లక్షన్నరకు పక్కా ఇల్లు నిర్మిస్తామన్న హామీ ఏమైందో చెప్పాలన్నారు. గ్యాస్ సిలిండర్‌పై వంద రూపాయలు సబ్సిడీ ఇస్తామని ఇచ్చిన హామీని ఏమి చేశారన్నారు.
ఇంటింటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందన్నారు. బిసిలకు ప్రత్యేక బడ్జెట్ ఏటా పదివేల కోట్లను ఖర్చుపెడాతమన్నారు. ఈ హామీని నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. కాపుసామాజికవర్గానికి ఏటా వెయ్యి కోట్లు ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. పోలవరాన్ని మూడేళ్లలో నిర్మిస్తారా, నేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారా, భూమి లేని పేదవారికి రెండు ఎకరాల భూమిని ఇస్తారా, లారీ, టాక్సీ, ఆటో డ్రైవర్లకు వాహనాల కొనుగోలుకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారని, ఈ హామీని అమలు చేశారా అని అడిగారు. అవినీతి లేని పరిపాలన అందించలేదన్నారు. చంద్రబాబు సిఎం అయ్యే నాటికి రూ.86,712 కోట్ల వ్యవసాయ రుణాలు ఉంటే, ఆయన మాటలు నమ్మి రుణాలు చెల్లించనందువల్ల 20 నెలల్లో వడ్డీ 14 శాతం చొప్పున 20 వేల కోట్ల రూపాయలైందన్నారు. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు రూ.7300 కోట్లనే చెల్లించిందన్నారు.