జాతీయ వార్తలు

పోలవరాన్ని సందర్శించిన సీఎం జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. ఈ మేరకు ఆయన హెలికాఫ్టర్‌లో విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆనంతరం హెలికాఫ్టర్ దిగిన తరువాత ఆయనకు ప్రజాప్రతినిదులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. వ్యూ పాయింట్‌కు చేరుకుని అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులకు సంబంధించిన అంశాలపై పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎగువ కాపర్ డ్యామ్ పనులు ఎంతవరకు పూర్తయ్యాయని అడిగారు. అధికంగా నీరు వస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. షెడ్యూల్ ప్రకారం దీని నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదని అన్నారు. కాగా సీఎం జగన్ వెంట ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, రాష్ట్రమంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పి.విశ్వరూప్‌ పలువురు ఎమ్మెల్యేలు పర్యటనలో పాల్గొన్నారు.