ఆంధ్రప్రదేశ్‌

ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు:సీఎం జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి వెళ్లాలని, సమాజంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రయోజనం కోసమే నవరత్నాలు ప్రవేశపెట్టామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఈరోజు ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ అర్హత వున్న ప్రతి ఒక్కరికి ఇవి అందాలని అన్నారు. ప్రజలకు అవినీతిరహిత పాలన అందిద్దామని అన్నారు. ఎన్నికలు అయిపోగానే మ్యానిఫేస్టోను చెత్తబుట్టలో వేసే సంస్కృతి పోవాలని అన్నారు. మ్యానిఫేస్టోను భవవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాలని అన్నారు. ఎవరైనా సరే అవినీతి, దోపిడీని ఈప్రభుత్వం సహించదని అన్నారు. గ్రామ వాలంటీర్లు అవినీతికి పాల్పడరాదని, వారు అవినీతికి పాల్పడకుండా ఉండాలనే నెలకు వారికి ఐదు వేల రూపాయల వేతనం అందిస్తున్నామని తెలిపారు. ఈ ఉగాదినాటికి 25 లక్షల మంది మహిళలకు సొంతింటి కోసం ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పారు. పట్టా ఇచ్చేటపుడు ప్లాటు ఎక్కడుందో చూపించాలని అన్నారు. ఇందుకోసం డిస్ట్రిక్ట్ పోర్టల్ ప్రారంభించాలని, అందులో అన్ని వివరాలు పొందుపరచాలని అన్నారు. మనం కూర్చున్న ఈ భవనం అక్రమ కట్టడమని, దీన్ని కూల్చివేస్తామని ప్రకటించారు.