కృష్ణ

విభజన అనంతరం వెలవెలబోతున్న గరికపాడు చెక్‌పోస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొక్కుబడి తనిఖీలతో సిబ్బంది కాలక్షేపం
జగ్గయ్యపేట , నవంబర్ 20: 8 ఏళ్లుగా జిల్లా సరిహద్దు గరికపాడు వద్ద ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలతో భారీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిన రవాణా చెక్‌పోస్టు నేడు మొక్కుబడి వాహనాల తనిఖీతో వెలవెలపోతోంది. విజయవాడ - హైదరాబాదు జాతీయ రహదారిపై భారీగా తరలివెళ్లే వాహనాలను దృష్టిలో పెట్టుకుని 8 ఏళ్ల క్రితం చిల్లకల్లు వద్ద రవాణా చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఏడాది వ్యవధిలోనే దాన్ని కృష్ణా, నల్లగొండ జిల్లాల సరిహద్దు గరికపాడు వద్దకు మార్పు చేశారు. అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించేందుకు పక్కా భవనంతో పాటు పక్కనే వాహనాలు కాటా పెట్టేందుకు వే బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టు ఇన్‌చార్జితో పాటు ఐదుగురు ఎఎంవిఐలు, హోంగార్డులతో పాటు అవసరాన్ని బట్టి ప్రైవేటు వ్యక్తులను విధుల్లోకి తీసుకొని నిత్యం రేయింబవళ్లు తనిఖీలు జరిపారు. గతంలో నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల నుండి భారీగా హైదరాబాదుకు ఇసుక రవాణా జరిగేది కాగా ఆ సమయంలో ఓవర్‌లోడ్ వాహనాల నుండి పెద్ద మొత్తంలో అపరాధ రుసుము వసూలు చేయడంతో ప్రభుత్వ ఖజానాకు లక్షల్లో ఆదాయం సమకూరేది. నెలలో రెండు మూడు పర్యాయాలు విజిలెన్స్ తనిఖీలు సైతం జరిగేవి. ఈ చెక్‌పోస్టులో మూడుసార్లు ఎసిబి దాడులు కూడా జరిగాయి. ఏడాదిన్నర క్రితం రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రా, తెలంగాణా రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడటంతో ఈ రవాణా చెక్‌పోస్టు రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుగా మారింది. మూడు మాసాల క్రితం రవాణా శాఖలో బదిలీలు జరిగిన నేపథ్యంలో ఇక్కడ అధికారులు అందరూ బదిలీలపై వేరే ప్రాంతాలకు వెళ్లారు. తదుపరి రవాణా శాఖలో జరిగిన పరిణామాల నేపధ్యంలో అధికారులు తాత్కాలిక సిబ్బందిని పూర్తిగా తొలగించారు. అక్కడ నుండి రవాణా వాహనాల తనిఖీ తగ్గిపోయి ఆదాయం పడిపోయింది. చెక్‌పోస్టు వద్ద ఉన్న వేబ్రిడ్జ్ పాడైపోడంతో అధికలోడు వాహనాల తనిఖీ పూర్తిగా నిలిచిపోయింది. అదే విధంగా కనకదుర్గమ్మ గుడి వద్ద ఫ్లైఒవర్ నిర్మాణం సందర్భంగా వాహనాలను వేరే మార్గంలో మళ్లించడంతో చెక్‌పోస్టు మార్గంలో వెళ్లే వాహనాల సంఖ్య తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఒక రకంగా గరికపాడు చెక్‌పోస్టు తమకు పనిష్మెంట్‌గా అక్కడ పని చేసే అధికారులే చెప్పడం విస్మయాన్ని కల్గిస్తుంది. సమీపంలో రెండు కిలో మీటర్ల దూరంలో తెలంగాణా రాష్ట్రం నల్లగొండ జిల్లా చిమిరాల వద్ద ఏర్పాటు చేసిన రవాణా చెక్‌పోస్టు భారీగా ఆదాయం పెంచుకుంటుంటే ఆంధ్ర ప్రాంత చెక్‌పోస్టు తనిఖీలు లేక ఖాళీగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. రవాణా శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఈ చెక్‌పోస్టుపై దృష్టి సారించాల్సిన అవసరం కనబడుతోంది.