తెలంగాణ

జైలు అధికారి అదృశ్యంపై ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: నల్గొండ జిల్లా భువనగిరి సబ్ జైలు నుంచి బదిలీ అయిన సూపరింటెండెంట్ శ్రీనివాస్ అదృశ్యం కావడంపై జైళ్లశాఖ ఉన్నతాధికారులు లక్సెట్టిపేటలో బుధవారం విచారణ చేపట్టారు. భువనగిరి నుంచి శ్రీనివాస్‌ను రెండు రోజుల క్రితం లక్సెట్టిపేట జైలుకు బదిలీ చేశారు. తనను అకారణంగా బదిలీ చేశారని మనస్తాపం చెందిన శ్రీనివాస్ లక్సెట్టిపేట సబ్ జైలుకు వచ్చిన కొద్దిసేపటికే వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ తెలియరాలేదు. విధుల్లో తాను చేరే ప్రసక్తి లేదని ఆయన లక్సెట్టిపేట సబ్ జైలు సిబ్బందితో చెప్పినట్లు సమాచారం. జైళ్లశాఖ ఉన్నతాధికారి వెంకటేశ్లర్లు లక్సెట్టిపేట జైలు సూపరింటెండెంట్ శోభన్, ఇతర సిబ్బందితో మాట్లాడి శ్రీనివాస్ గురించి ఆరా తీశారు. అయితే, విచారణలో వెల్లడైన అంశాలను మీడియాకు చెప్పేందుకు ఆయన నిరాకరించారు.