భక్తి కథలు

జైమిని భారతం - 91

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రాజు కలలో కూడా బొంకు పలకని సత్యవ్రతుడు. ‘యథారాజా తథా ప్రజా’ అన్నట్లు అక్కడి ప్రజలు కూడా సత్యాన్ని ఆరాధించేవారే. వీరవర్మకు ఇల్లరికపుటల్లుడు యమధర్మరాజు. వీరవర్మ మహాదాత. ‘బ్రాహ్మణోమమదేవాః’ అని నిత్య బ్రాహ్మణారాధన బుద్ధి కలవాడు.
ధర్మరాజు మయూరధ్వజుల యాగాశ్వాలు తన రాజ్యంలో పాదం మోపాయని తెలుసుకొన్న వీరవర్మ గుఱ్ళాన్ని బంధించుడని భటులకు ఆజ్ఞాపించేడు.

వీరవర్మ పాండవ హయంబు
వీరవర్మ కుమారులు సులోలుడు, కువలసుడు ఇద్దరూ సైన్య సమైతులై వచ్చి అర్జునుని సేనను లెక్కచేయక ఎదిరించేరు. యాగాశ్వాల్ని బంధించేరు.
మొట్టమొదట హరి ఓం అని బాణ ప్రయోగం చేసేడు బభ్రువాహనుడు. సైనికులు పిడికిళ్లతో (ముష్టాముష్టీ) పొడుచుకొన్నారు. చేతులతో (బాహాబాహీ) కొట్టుకున్నారు. జుట్టూ జుట్టూ (కచాకచీ) పట్టుకొని ఒకరినొకరు లొంగదీయాలనుకొన్నారు. ద్వంద్వ యుద్ధం సంకులంగా మారింది.
వీరవర్మ పుత్రులు పదివేల రథ సైన్యంతో బభ్రువాహనుణ్ణి ముందుకు సాగకుండా అడ్డుకొన్నారు. ఆ సమయంలో యుద్ధం ఒక ప్రళయ రుద్రుని తాండవాన్ని తలపించింది. ఓ ప్రక్క బభ్రువాహనునికి సహాయపడుతున్న ప్రద్యుమ్నుని బాణాలకు అరటిచొప్ప కాలినట్లు శత్రుబలం దహించుకుపోతోంది.
మరోప్రక్క సాక్షాత్తూ యమధర్మరాజు వీరవర్మ పక్షాన నిలబడి పాండవ సైన్యాన్ని అంతం చేస్తున్నాడు. అర్జునుడు ఆశ్చర్యపోయేడు. ‘కృష్ణా! చూడు! అతడెవరో దివ్యపురుషుని వలె ఉన్నాడు. దురంత పరాక్రమంతో మన సేనల్ని చెండాడుతున్నాడు’ అన్నాడు అర్జునుడు.
‘‘అర్జునా! అతడు యముడు. వీరవర్మ కూతురు సుమాలినికి భర్త. వీరవర్మ ప్రార్థన అంగీకరించి యముడు అతనికి ఇల్లరికపు అల్లుడుగా ఉన్నాడు. ఆ ఉదంతం చెపుతాను విను.
వీరవర్మ ఏకైక కుమార్తె సుమాలిని. బిడ్డకు పెండ్లిరుూడు రాగానే తల్లీ! నీకు ఏ రాజకుమారడు అంటే ఇష్టం. ఎవరిని నీకు వరునిగా తీసుకురాను?’ అన్నాడు వీరవర్మ.

యముని వృత్తాంతం

సుమాలిని మానవ మాత్రుల్ని పెండ్లిఆడడానికి ఇష్టపడలేదు.
‘తండ్రీ! నరులకు చావు సహజం. నరుణ్ణి పెండ్లాడి చివరకు వాని మరణంతో నా ప్రాణాలు పోగొట్టుకోలేను. అలా చేస్తే ఏముంది? యముని చేతిలో పడి పాప కర్మ ఫలితాలు అనుభవించి అనేక జన్మల్ని పొందడం కంటే- యముణ్ణే పెనిమిటిగా వరిస్తాను. ఇది నాకు ధర్మం అనిపిస్తోంది’.
కూతురు మాటలకు వీరవర్మ లోలోపల సంతోషించేడు.
తాను యమసూక్తాలు పఠించి యముణ్ణి ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నించేడు. సుమాలిని నిష్ఠతో అనేక వ్రతాలు ఆచరిస్తోంది.
ఈ సంగతి తెలిసిన దేవర్షి నారదుడు యముని దర్శించి ‘చిత్రపురిని పాలించే వీరవర్మ కుమార్తె సుమాలిని. చాలా సౌందర్యవతి. దైవ భక్తురాలు. అటువంటి కన్యకామణి నీకు భార్యగా తగినది. ఆ పుణ్యశీల నినే్న వరించి నిన్ను పొందగోరి అనేక వ్రతాలూ దానధర్మాలూ ఆచరిస్తోంది. ఆమెను పరిగ్రహించు’’ అన్నాడు.
‘సరే! నారదా! నువ్వు పోయి వీరవర్మకు నా అంగీకారం తెల్పు.
- ఇంకా ఉంది

-- బులుసు వేంకటేశ్వర్లు