భక్తి కథలు

జైమిని భారతం - 92

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను వైశాఖ శుక్లపక్షంలో వీరవర్మను వచ్చి కలుస్తాను’ అన్నాడు యముడు. యముడు తన అనుచరులకు, బలగానికి చిత్రపురికి రమ్మని అచ్చట రాజకుమార్తెతో తన వివాహమని చెప్పేడు. రాజయక్ష్మ, వ్రణ, జ్వర, మేహాది రోగాధి నాయకులు, శూల, గ్రహణి, వాత, మహోదర, అపస్మార ప్రభృతులు సకల రోగ స్వరూపులు యమధర్మరాజుకు మ్రొక్కి ఇలా అన్నారు (సమస్తరోగాలకు ప్రభువు యముడు. యమప్రార్థన వాటికి ఉపశమనం)
‘మహానుభావా! చిత్రపురిలో అడుగుపెట్టలేం. ధర్మం నాలుగు పాదాలా నడుస్తున్న చోట మాకు నిలువనీడ ఉండదు. మీకు తెలియనిది కాదు. మీ వివాహం చూసే యోగ్యత లేదు’’
‘మీరు పుణ్యాత్ములకు పవిత్ర రూపులుగానూ, పాపాత్ములకు రోగ రూపంతోనూ కనిపిస్తారు. పరితాపం చెందకండి. కామరూపాలు ధరించి కదలిరండి!’ యముడు వారిని ఉత్సాహపరిచేడు.
మోహనమూర్తిగా మారిన యమధర్మరాజు మనుష్యరూపం ధరించి అనుయాయులతో వైభవంగా చిత్రపురికి తరలివచ్చేడు. వీరవర్మ ఎదురేగి స్వాగతం పలికి యముణ్ణి ఆస్థానానికి తీసుకువచ్చేడు.
‘ఇపుడు చెప్పవయ్యా, నీ కోరిక ఏమిటో!’ అన్నాడు యముడు.
‘దేవా! నాకు ప్రాణావసాన సమయంలో శ్రీకృష్ణుని పాద పద్మాలు చూపించండి, చాలు. ఇతర వరాలు ఏమీ అక్కరలేదు’.
వీరవర్మ విష్ణ్భుక్తికి సంతోషించి యముడు ఆయన కుమార్తె సుమాలినీ దేవిని పెండ్లాడి- వీరవర్మ రాజ్యంలో నివసిస్తున్నాడు. ఇదీ యమధర్మరాజు చిత్రపురిలో ఉండడానికి కారణం.
‘‘అర్జునా! ఇక్కడ జరగబోయే యుద్ధం చాలా భయంకరంగా ఉంటుంది. మన బభ్రువాహన సాళ్వ వృషకేత ప్రద్యుమ్న మయూర ధ్వజాదుల్ని సిద్ధం చేయి’’ అని పలికి శ్రీకృష్ణుడు అర్జునుని రథాన్ని అధిరోహించేడు.
వీరవర్మ శ్రీకృష్ణుని ఎదుర్కొని ‘అర్జునుడూ నీవూ ఈ దినం నా ప్రతాపాన్ని చూడగలర’ని పలికి ఆరు బాణాలు కృష్ణునిపై, ఏడు బాణాలు అర్జునునిపై సంధించేడు. అర్జునుడు మహోగ్ర శరాలతో వీరవర్మను ఎదుర్కొన్నాడు. వీరవర్మ ప్రయోగించిన బాణాలన్నింటినీ వమ్ము చేసేడు ధనంజయుడు. వీరవర్మ ఏ మాత్రం చలించలేదు. మొక్కవోని ధైర్యంతో అచ్యుతుణ్ణీ- అర్జునుని రథకేతనంపై అధివసించిన ఆంజనేయుణ్ణీ కూల్చడానికి ప్రయత్నించేడు. గంధర్వ బాణంతో అశేష పాండవ సైన్యాన్నీ సమ్మోహనం చేసేడు.
పార్థసారథి శ్రీకృష్ణుడు మారుతికి వౌన సందేశం ఇచ్చేడు. ‘శత్రువుపై అకస్మాత్తుగా దాడి చేస్తేకాని జయం కలుగదు. ధర్మయుద్ధం చేసి వీర వర్మను గెలువలేం. నువ్వు అర్జునునికి సాయపడు.
ద్రోణాద్రిని తోకతో చుట్టి పట్టినట్లు వీరవర్మ రథాన్ని చుట్టి మహావేగంతో ఆకాశానికి తీసుకుపోయేడు- ఆంజనేయుడు. వీరవర్మ మారుతిని తప్పించుకొని వచ్చి కృష్ణార్జునులిద్దర్నీ కుదియపట్టి ఆకాశానికి లంఘించేడు. ‘ఇప్పుడు శౌరిని అర్జునునితో విడగొట్టి వైకుంఠానికి పంపి లక్ష్మీదేవికి ఆనందం కలిగిస్తాను’ అని దగ్గరకు వచ్చిన ఆంజనేయుణ్ణి పిడికిలితో పొడిచేడు వీరవర్మ. ఆ దెబ్బకు మారుతి తెలివి తప్పి పడిపోయేడు.
తీవ్ర కోపుడైన మధుసూదనుడు వీరవర్మ తలను గుప్పున బలంగా తనే్నడు. ఆ దెబ్బకు వీరవర్మ మూర్ఛనంది, తరువాత తెప్పరిల్లి కృష్ణార్జునులను సమీపించేడు.
‘‘నేను యుద్ధంలో దేవదానవులనైనా లెక్కచేయను. ఈ దినం శ్రీకృష్ణుని పాద పద్మం నా శిరస్సున తాకిన కారణంగా నేను ధన్యుణ్ణి అయ్యేను’’.
- ఇంకా ఉంది

- బులుసు వేంకటేశ్వర్లు