భక్తి కథలు

జైమిని భారతం - 93

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినయ వినమితుడయ్యేడు వీరవర్మ. ‘‘అర్జునా! వీరవర్మ సార్థక నామధేయుడు. సత్వ సంపన్నుడు. భక్తుడు. మహాయోధులైన మయూరధ్వజుని వంటి అనేక వీరులను జయించినవాడు. మీదు మిక్కిలిగా నా భక్తుడు కూడా’’.
కృష్ణార్జునులు వీరవర్మరాజ్యంలో అయిదు దినాలు వసించి అతని ఆతిథ్యాన్ని స్వీకరించేరు. ఆ మరునాడు వీరవర్మ డెబ్భై వేల ఏనుగులు, ఎనిమిది రకాలైన ముక్తామణి రాశుల్ని కృష్ణార్జునులకు కానుకలుగా అందించేడు.
మళ్లీ యాగాశ్వాలు బయలుదేరాయి.
రెండు యాగాశ్వాలూ భయంకరమైన మహానదిని దాటేయి. పెద్ద పెద్ద ఏనుగుల్ని పట్టి మింగగల తిమితిమింగలాలకు నిలయమైంది ఆ నది.
కృష్ణార్జునులు వారి సేనలూ నదిని తరించి అవ్వలి యొడ్డుకు చేరుకొన్నారు. కాని ఎక్కడా యాగాశ్వాల జాడ లేదు. ఇద్దరూ చుట్టుప్రక్కల గాలించేరు. కాని యాగాశ్వాలు ఏమైపోయాయో తెలియలేదు.
ఆ సమయంలో దేవర్షి నారదుడు ఆకాశవీధి నుండి దిగి వచ్చి కృష్ణార్జునుల ముందు ప్రత్యక్షమయ్యేడు. దేవమునికి కృష్ణార్జునులు ఇరువురూ నమస్కరించేరు.
‘‘మీ యాగాశ్వాలు కుంతల దేశానికి చేరుకొన్నాయి. ఈ దేశానికి రాజు చంద్రహాసుడు. అతని పరాక్రమంలో పదహారో వంతుకు కూడా నేటి రాజులు సరిపోరు. అతని చరిత్ర పావనం. మీకు వినడానికి ఇది సందర్భం కాదు. పైగా మీ గుఱ్ఱాలు చాలా దూరం పోయేయి’’ అన్నాడు నారదుడు.
అర్జునునికి చంద్రహాస చరిత్ర వినాలనిపించింది.
‘‘మహానుభావా! మీ బావ ఇంతవరకు ఎన్నో కథలు చెప్పేడు. యుద్ధ సమయంలో పుణ్య కథలు వినడం కూడా ఒక అదృష్టం. పుణ్యకథాశ్రవణంవల్ల పాపాలు నశించడమే కాదు, పుణ్యబుద్ధి సమకూరుతుంది.
నారదుడు చంద్రహాసుని చరిత్ర చెప్పడానికి ఉద్యుక్తుడయ్యేడు.
పూర్వం కేరళ దేశాన్ని పరిపాలించే రాజునకు మూలానక్షత్రంలో ఒక కుమారుడు జన్మించేడు. శిశువు పుట్టిన కొన్ని దినాలకే మహారాజు యుద్ధంలో శత్రువుల చేతిలో సంహరించబడ్డాడు. రాజు మరణవార్త విని రాణి కూడా ప్రాణాలు విడిచింది.
దాదులు ఆ రాజకుమారుణ్ణి కుంతంల పురానికి తీసుకువచ్చి మూడేండ్లు పెంచేరు. ఏమి విధి వైపరీత్యమో, ఆ దాదులు కూడా చనిపోవడంతో రాచబిడ్డ అనాథ అయ్యేడు. పున్నమి వెనె్నల తలపించే నవ్వులతో చందమామ వంటి రూపంతో ప్రకాశిస్తున్న ఆ బాలునికి పౌరకాంతలు చంద్రహాసుడని పేరు పెట్టేరు. ఒక స్ర్తి స్నానం చేయించగా మరొక భామిని కడుపార అన్నం పెట్టేది. ఇంకొక కాంత తల దువ్వి కూకట్లు ముడిచేది. చంద్రహాసుడు సార్థక నామధేయుడై పంచవర్ష ప్రాయుడయ్యేడు. కుంతలంలోని అందరి ఇళ్లూ చంద్రహాసునికి విహారభూములే.
ఒకనాడు చంద్రహానుడు ఆటలాడుతూ కుంతల దేశ మహామంత్రి అయిన దుష్టబుద్ధి సౌధానికి వెళ్ళేడు. ఆ సమయంలో మంత్రి మహామునులతో ముచ్చటిస్తున్నాడు. చంద్రహాసుని చూచి మహామునులు ‘ఎవరీ ముద్దులొలికే బాలుడు? భవిష్యత్‌లో చక్రవర్తి కాగలడు. అట్టి సర్వ లక్షణాలూ ఉన్నాయి’’ అన్నారు.
దుష్టబుద్ధి మునుల మాటల్ని వినీ విననట్లు నటించి మునుల్ని గౌరవంగా సాగనంపేడు. వారు వెళ్లీ వెళ్లగానే క్రూరులైన భటుల్ని పిలిచి ‘ఈ బాలుణ్ణి తీసుకుపోయి వధించండి’ అని వారికి ఆజ్ఞాపించేడు. భటులు చంద్రహాసుణ్ణి ఒక అరణ్య మధ్యానికి కొనిపోయి ఖండించడానికి కత్తి ఎత్తేరు.

- ఇంకా ఉంది

బులుసు వేంకటేశ్వర్లు