భక్తి కథలు

జైమిని భారతం - 98

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనుడు చంద్రహాసునికి రాజాజ్ఞను వినిపించి అతనిని రాజమందిరానికి పంపి అతని బదులు కాళికను పూజించడానికి తాను బయల్దేరాడు.
చంద్రహాసుడు రాజమందిరం చేరగానే రాజు అతనిని ప్రియమారా కౌగిలించుకొని గాలవుని ఆధ్వర్యంలో తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసేడు. ఆ క్షణంలోనే రాజ్యానికి అల్లుణ్ణి పట్ట్భాషిక్తుణ్ణి చేసి చంద్రహాస చంపకమాలినులను దీవించి తపోవనాలకు వెళ్లిపోయేడు.
ఇక్కడ.. పూమాలలూ పండ్లూ మొదలగు పూజా ద్రవ్యాలతో కాళికాలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన మదనుణ్ణి అక్కడ పొంచి ఉన్న తలారులు రెండుగా నరికివేసేరు.
చంద్రహాసుడు కుంతల దేశాధిపతియై- చంపకమాలినీ పతియై మహావైభవంగా ఊరేగింపుగా వచ్చి దుష్టబుద్ధి పాదాలకు నమస్కరించేడు. తన వ్యూహం బెడిసికొట్టిన సంగతిని దాచి అన్ని సంగతులూ తెలుసుకొన్న దుష్టబుద్ధి దిగ్భ్రాంతుడయ్యేడు. తన బదులు మదనుడు కాళికాలయానికి వెళ్ళేడని చంద్రహాసుడు చెప్పగా దుష్టబుద్ధి తలపై పిడుగులు పడ్డట్లు కూలిపోయేడు.
ఆభరణాలు రాలిపోతుంటే కట్టిన బట్ట జారిపోతుంటే ఊరేగింపులోనుండి పిచ్చివానివలె కాళికాలయానికి పరుగులు తీసేడు దుష్టబుద్ధి, తల, గుండె, కడుపులమీద బాదుకొంటూ పెద్దగా ఏడుస్తూ కాళికాలయం వద్దకు వెళ్లి చూస్తే- ఏముంది? మదనుని శరీరం రెండు ఖండాలుగా పడి వుంది.
విష్ణ్భుక్తులకు అపకారం చేయాలనుకొనేవారికి జరుగవలసిన శాస్తి ఇదే అని నిర్ణయించుకొని- దుష్టబుద్ధి బలిపీఠంపై తలమోదుకొని ప్రాణాలు విడిచేడు.
తెల్లవారింది. కాళీమాతను అర్చించే బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి అక్కడ పడి వున్న మంత్రి, మంత్రి కుమారుల ఖండిత శరీరాల్ని చూసి చంద్రహాసునకు విషయ నివేదన చేసేడు.

చంద్రహాసుడు దుష్టబుద్ధి
చంద్రహాసుడు వేగంగా కాళికాలయానికి వెళ్లి మామ, బావమరుదుల్ని చూసి ఎంతో దుఃఖించేడు. ‘వీళ్లను బ్రతికించకపోతే నీలాపనింద నాపై పడుతుందని’ భావించేడు. ఋత్విక్కులచే హోమకుండాన్ని రగుల్కొల్పి- పంచదార, నువ్వులు, పాయసం అగ్నికి సమర్పించేడు. తరువాత తన శరీరపు కండల్ని తిరిగి హోమాగ్నికి సమర్పించేడు.
చంద్రహాసుని భక్తికి జగదంబ ప్రత్యక్షమైంది.
‘అమ్మా! నువ్వు విష్ణువునందుండే చిచ్ఛక్తివి. నీకు ప్రీతిగా నా శిరస్సును పూర్ణాహుతిగా సమర్పించుకొంటున్నాను. స్వీకరించు అని చంద్రహాసుడు ఖడ్గాన్ని అందుకోగానే ఆ తల్లి చేయి పట్టుకొని ఆపింది.
‘‘వత్సా! నీ అభీష్టం ఏమిటో చెప్పు’’
‘‘అమ్మా! ముందుగా వీళ్లని బ్రతికించు. నిరంతరమైన విష్ణ్భుక్తిని నాకు ప్రసాదించు’’
వారాహీదేవి చంద్రహాసునికి కోరిన వరాలు ఇవ్వడమేగాక- బలసమన్వితులైన కుమారులు కలుగునట్లు ఆశీర్వదించింది. చంద్రహాసుని దగ్గరకు రమ్మని పిలిచి వాత్సల్యంతో తలపై చేయి పెట్టి తత్వజ్ఞాన బోధ కావించింది- చండిక.
చిరునవ్వుతో కాళికాదేవి అదృశ్యమైన క్షణం పుష్పవృష్టి కురిసింది. నిద్ర మేల్కాంచిన వారిలా దుష్టబుద్ధీ, మదనుడూ పునర్జీవితులయ్యేరు.
అనంతరం భార్యా సమేతుడై- దుష్టబుద్ధీ మదనుడూ వెంట రాగా స్వరాజ్యానికి వెళ్లి తల్లిదండ్రులకు మ్రొక్కి ఆనందింపజేసేడు చంద్రహాసుడు. చంపకమాలినీ, విషయలు పట్టపురాణులై పద్మాక్ష- మకర ధ్వజులనే ఇరువురు కుమారుల్ని కన్నారు.
- ఇంకా ఉంది

-- బులుసు వేంకటేశ్వర్లు