జాతీయ వార్తలు

ద్రవ్యబిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ కుదరదు: జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆర్థిక బిల్లు అని లోక్‌సభ కార్యదర్శి స్పష్టం చేశారని, ద్రవ్యబిల్లుపై ఓటింగ్ జరిపే సంప్రదాయం రాజ్యసభలో లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం స్పష్టం చేశారు. కొన్ని అంశాలపై రాజ్యసభలో నేరుగా చట్టం చేసే అవకాశం లేదన్నారు. ఆయన రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రకటిస్తూనే, ఎపికి విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఆ హామీలను ఎలా తీర్చాలన్న విషయమై చర్చలు జరుపుతున్నామన్నారు. ఎపి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. ఎపి సిఎం చంద్రబాబుతో ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నారని వివరించారు.