బిజినెస్

సుస్థిర పన్ను విధానాలే ఉత్తమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

న్యూఢిల్లీ, జనవరి 2: పన్నుల విధానాల్లో పారదర్శక ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని, సుస్థిర పన్ను విధానాలే ఉత్తమమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పన్ను చట్టాల పునరావలోకనం దేశాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని, మదుపరులను దూరం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ భారతీయ రెవిన్యూ సర్వీస్‌లో శిక్షణ పొందుతున్న అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. కాగా, ప్రతిష్టాత్మక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందుతుందన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ వచ్చే నెల ఫిబ్రవరి చివరి వారంలో మొదలుకానున్నాయి.