జాతీయ వార్తలు

అరుణ్‌ జైట్లీ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించటంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి చికిత్సపొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణించి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కన్నుమూశారు. అరుణ్ జైట్లీ కేంద్రంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. 2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన జైట్లీ మోదీ ప్రభుత్వ హయాంలో ఆర్థికశాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2017 అప్పటి మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లటంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వహించారు. ఆరోగ్యం సరిగా లేకపోవటంతో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చినా మంత్రివర్గంలో చేరలేదు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికి పరిమితమయ్యారు.