జాతీయ వార్తలు

జైట్లీ మృతికి పలువురు సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతి తీరని లోటు అని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఆయన దేశ పురోగతి కోసం ఎంతో పాటు పడ్డారని నివాళులర్పించారు.

మంచి స్నేహితుడ్ని కోల్పోయా:మోదీ

అరుణ్‌జైట్లీ మరణంతో తాను మంచి స్నేహితుడ్ని కోల్పోయానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జైట్లీ మరణ వార్త తెలిసిన వెంటనే విదేశీ పర్యటనలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. విదేశీ పర్యటన నుంచి రావద్దని జైట్లీ కుటుంబ సభ్యులు మోదీని కోరటం జరిగింది. కాగా జైట్లీ మృతికి సంతాపం తెలియజేస్తూ బీజేపీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందని అన్నారు. విద్యార్థి నాయకునిగా ఉన్నప్పటి నుంచి దేశం కోసం పాటుపడ్డారని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతో శ్రమించారని అన్నారు.

కుటుంబ సభ్యుడ్ని కోల్పోయినంత బాధ

అరుణ్ జైట్లీ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని కేంద్ర మంత్రి అమిత్‌షా అన్నారు. కుటుంబ సభ్యుడ్ని కోల్పోయినట్లుగా ఉందని అన్నారు. నాకు ఎల్లప్పుడూ మార్గదర్శికంగా నిలిచారని అన్నారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం

అరుణ్ జైట్లీ మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.