జాతీయ వార్తలు

జకీర్ ఇండియా రాడట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై:్ఢకాలో ఉగ్రవాద చర్యలకు పరోక్షంగా కారణమయ్యాడన్న ఆరోపణల నేపథ్యంలో ఇండియాలో పీస్ టీవి వ్యవస్థాపకుడు, మతపెద్ద జకీర్‌నాయక్ భారత్‌కు రావడం లేదని ఆయన ప్రతినిధులు స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా ఆయన ప్రసంగాలు ఉంటున్నాయని, అనుమతిలేకుండా టీవీ ప్రసారాలు నిర్వహించారని వస్తున్న విమర్శలకు ఆయన మీడియా సమావేశంలో జవాబు చెబుతారని మొదట ఆ ప్రతినిధులు ప్రకటించారు. అయితే ఆయన ఇండియాకు రారని, సౌదీ అరేబియాలోని మదీనానుంచి స్కైప్‌లో విలేకరులతో మాట్లాడతారని వారు ప్రకటించారు. ఆయన దేశంలోకి అడుగుపెట్టిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుంటారన్న భయంతో జకీర్ వెనుకడుగు వేసినట్లు భావిస్తున్నారు.