హైదరాబాద్

జలగండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాహార్తి తీర్చని గోదావరి జలాలు
సింగూరు, మంజీరాల నుంచి నిల్చిపోయిన సరఫరా
తాగునీటి కోసం విలవిల్లాడుతున్న శివార్లు
మున్ముందు నగరానికి కృష్ణా,గోదావరి జలాలే దిక్కు
హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 11: మహానగరంలో రోజురోజుకీ తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. కోర్ సిటీలో అడపాదడపా రోజువిడిచి రోజు తాగునీరు సరఫరా అవుతున్నా, శివార్లు మాత్రం చుక్క నీటి కోసం చుక్కలు చూస్తున్నాయి. కుత్బుల్లాపూర్, అల్వాల్, కూకట్‌పల్లి, పటాన్‌చెరు ప్రాంతాల్లో వారం , పదిరోజులకోసారి తాగునీరు సరఫరా కావటంతో ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం. జంటనగర ప్రజల దాహార్తిని తీర్చే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో వర్షాభావం కారణంగా నీటి మట్టాలు పడిపోవటంతో సమస్య తీవ్రమైంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలం, చలి కాలంలోనూ నగరాన్ని నీటి సమస్య పట్టి పీడిస్తోంది. నగర ప్రజల అవసరాలను బట్టి రెండురోజులకోసారి సరఫరా చేసినా 510 ఎంజిడిల నీరు అవసరమవుతుంది. కానీ కొరత కారణంగా వివిధ దశలుగా 270 ఎంజిడిల నీరు కృష్ణా నుంచి వస్తుండగా, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుంచి 25 ఎంజిడిలు, సింగూరు, మంజీరాల నుంచి 50 ఎంజిడిలు కొద్దిరోజుల క్రితం వరకు సరఫరా చేసేవారు. అయితే జలాశయాల్లో నీటి మాట్టాలు పూర్తిగా పడిపోవటంతో సరఫరా స్తంభించింది. ఎండలు బాగా పెరిగి జంట జలాశయాలు ఎండిపోయినా, సింగూరు, మంజీరా జలాశయాల నగరవాసుల దాహర్తిని తీర్చేవి. అయితే ప్రస్తుతం పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. గత నెల చివరి వారంలోనే ఈ రెండు జలాశయాల్లోని నీటిని నగరానికి సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం నిరాకరించటంతో ముఖ్యమంత్రి కెసిఆర్ జోక్యంతో నవంబర్ నెలాఖరు వరకు మాత్రమే నీరందించేందుకు అధికారులు అంగీకరించినా, ప్రస్తుతం నగరానికి సరఫరా నిలిపివేశారు. పరిస్థితి ఇపుడే ఇలా ఉంటే మున్ముందు వేసవి కాలంలో నగరవాసులకు కృష్ణా,గోదావరి జలాల్లో దిక్కయ్యేలా ఉన్నాయి.
అంతలోపు గోదావరి నుంచి మూడు దశలుగా నీటిని తరలించవచ్చునని జలమండలి అధికారులు భావించారు. కానీ వారి ప్రయత్నం ఫలించినా కేవలం 57 ఎంజిడిల నీరు మాత్రమే తేగలిగారు. ఘన్‌పూర్ వరకు గోదావరి మూడు దశలుగా నీటిని తీసుకువచ్చినా, అంత పెద్ద మోతాదులో నగరంలో నీటిని నిల్వ ఉంచేందుకు రిజర్వాయర్లు అందుబాటులో లేకపోవటంతో అధికారులు తక్కువ పరిమాణంలో నీటిని తరలిస్తున్నారు. ఫలితంగా శివార్లకు సరిపోయేలా మంచినీరు సరఫరా చేయలేకపోతున్నారు. వర్షాభావం తాగునీటి కోసం విలవిలలాడుతున్న భాగ్యనగర వాసుల గొంతు తడిపేందుకు వందల కిలోమీటర్ల నుంచి పరుగులు తీస్తూ గోదారమ్మ నగరానికొచ్చినా, ఆశించిన ఫలితం దక్కటం లేదు.
జోరుగా నీటి వ్యాపారం
మహానగరంలో నెలకొన్న మంచినీటి సమస్యను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు ఇష్టారాజ్యంగా నీటి దందాను కొనసాగిస్తున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎక్కడబడితే అక్కడ ఇష్టారాజ్యంగా బోర్లు వేసి, తూతుమంత్రంగా నీటిని శుద్ధి చేసి బోర్ నీటినే మినరల్ వాటర్‌గా నమ్మిస్తూ అమ్మకాలు చేపడుతున్నారు. జిహెచ్‌ఎంసిలో విలీనమైన పనె్నండు మున్సిపాల్టీల్లో రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజ్‌గిరి, పటాన్‌చెరు, రామచంద్రాపురం, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో జిహెచ్‌ఎంసి బల్క్ వాటర్ ద్వారా సప్లై చేసేది. ఇపుడు నీటి కొరత కారణంగా సక్రమంగా సరఫరా లేకపోవటంతో నీటి వ్యాపారులు సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
ఈ ప్రాంతాలనే టార్గెట్ చేసుకుని మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రజల దాహమే వీటి దందాకు పెట్టుబడి అని చెప్పవచ్చు. గతంలో కేవలం రూ. 5 నుంచి రూ. 10మధ్య విక్రయించే మినరల్ వాటర్ క్యాన్‌ను ఇపుడు ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రూ. 30 నుంచి 40, మరికొన్ని ప్రాంతాల్లో చల్లటి నీరైతే రూ. 50కు కూడా విక్రయిస్తున్న సందర్భాలున్నాయి.
భవిష్యత్ తరాలకు తెలిసేలా ఉద్యమకారుల చరిత్ర నిక్షిప్తం
వికారాబాద్, డిసెంబర్ 11: భవిష్యత్ తరాలకు తెలిసేలా తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను పుస్తకం, ఆన్‌లైన్‌ల రూపంలో పొందుపరుస్తామని మాజీ శాసనసభ్యుడు యెనె్నం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం స్థానిక టిఎన్‌జివో భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజా తెలంగాణ, తెలంగాణ ఉద్యమ వేదిక, బచావో తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను వెలుగులోకి తెచ్చి, ఫిబ్రవరి లేదా మార్చిలో హైదరాబాద్‌లో సన్మానం చేస్తామని చెప్పారు. జూన్ 2న ప్రభుత్వం ఏర్పాటైనా తెలంగాణ ఉద్యమకారులు, అమరులైన వారిని స్మరించుకోలేదని విమర్శించారు. జయశంకర్ త్యాగానే్న మరచినవారు సాధారణ ఉద్యమకారులను గుర్తిస్తారని నమ్మడం లేదని పేర్కొన్నారు. భారతదేశంపై దండయాత్ర చేసినవారు చరిత్ర రాసినట్టు, అలాంటి పొరపాటు జరగకుండా తెలంగాణ చరిత్ర రచన జరగాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర రాసినందుకే పోరాటయోధుల విషయాలు తెలుస్తుందని తెలిపారు. తాము రాజకీయ పార్టీయేతరులమని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దేశ నాయకులను పిలిచి చేసుకోవాల్సిన వేడుకను దొంగల్లాగా రాజ్‌భవన్‌లో, పంపకాలు చేసుకునే విధంగా జరుపుకోవడం ఆశ్చర్యకమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం ఎంతోమంది జాతీయ నాయకులు ఉద్యమానికి మద్దతిచ్చారని, ఏ రాజకీయ నాయకులు బయటకు రాకున్నా అజిత్‌సింగ్, మాయావతి, రాంవిలాస్ పాశ్వాన్, శరత్‌పవార్‌లు మద్దతు పలికారని వారినైనా రాష్ట్ర అవతరణ వేడుకలకు పిలవలేదని గుర్తుచేశారు. సమష్టిపోరాటం తెలంగాణ అని భావితరాలకు తెలిసి వచ్చేవిధంగా ఉద్యమకారుల సన్మానానికి జాతీయ నాయకులను ఆహ్వానిస్తామని వివరించారు. జిల్లాకు వెయ్యి మంది చొప్పున పది వేల మంది ఉద్యమకారుల చరిత్రను నిక్షిప్తం చేస్తామని చెప్పారు. ఉద్యమకారుల ఉద్యమ విషయాలను రికార్డు చేస్తామని తెలిపారు. ఉద్యమకారుల చరిత్రను పొందుపర్చడంలో, సన్మానం విషయంలో ఎవరు సహకరిస్తే వారి సహకారం తీసుకుంటామని అన్నారు. ఉద్యమకారుల చరిత్ర, రికార్డులను వెబ్‌సైట్‌లో ఉంచితే తరతరాలు చూస్తాయని వివరించారు. తెలంగాణ ఉద్యమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర పోరాట చరిత్ర లిఖించదగినదని ఉద్యమకారుల కోరిక అన్నారు. ప్రజా తెలంగాణ కన్వీనర్ గాదె ఇన్నయ్య మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా ఉద్యమకారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కో కన్వీనర్ శ్రీశైలరెడ్డి మాట్లాడుతూ మూడు సంస్థలు ఒకే వేదిక మీదకు వచ్చి గ్రామగ్రామాన తిరిగి ఉద్యమకారులను గుర్తించి వారి మాటలను, విషయాలను రికార్డు చేసి చరిత్రను రచించాలన్నదే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సమావేశంలో ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి నాయకులు కృష్ణమాదిగ, బాబుమహదేవ్, చారి, డిసిసి అధికార ప్రతినిధి ఆవుటి రాజశేఖర్, ప్రజాతెలంగాణ నాయకుడు కృష్ణంరాజు మాట్లాడుతూ ఉద్యమకారులు ఉద్యమ విషయాలను రికార్డు చేసుకోవాలనుకుంటే 9100081070, 71, 72 నెంబర్లను సంప్రదించాలని కోరారు.