రాష్ట్రీయం

ఎన్‌టిఆర్ జలసిరి కింద 50వేల బోర్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 31: రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరందించాలన్న ఉద్దేశ్యంతో ఎన్‌టిఆర్ జలసిరి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూగర్భజలాలను పెంపొందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోపక్క అవసరమైన ప్రాంతాల్లో బోర్లు వేసుకునేందుకు పెద్దఎత్తున బోర్లను మంజూరు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యేక అభివృద్థి పథకం (ఎస్‌డిపి) కింద ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు, రాయలసీమలోని కర్నూలు,కడప, చిత్తూరు, అనంతపూర్ జిల్లాల్లో 50వేల బోర్లను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. ఉపాధి హామీ నిధులు, విద్యుత్ సంస్థలు, ప్రత్యేక అభివృద్థి పథకం నిధులు అనుసంధానం చేసి బోర్లకు అవసరమైన రాయితీలు కల్పిస్తామన్నారు.