జాతీయ వార్తలు

జమ్మూలో హై అలెర్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: పూల్వామా దాడి అనంతరం జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. సరిహద్దు గ్రామాల ప్రజలను తరలిస్తున్నారు. జేకెఎల్‌ఎఫ్ అధినేత యాసిన్ మాలిక్‌తో పాటు మరో 24మంది జమాతే ఇస్లామీ నేతలను అరెస్టు చేసిన నేపథ్యంలో కాశ్మీర్ లోయలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్రం వంద కంపెనీల అదనపు పారామిలటరీ దళాలను ప్రత్యేక విమానాల్లో శ్రీనగర్‌కు తరలించారు. కాశ్మీర్ లోయలో నేతల అరెస్టు నేపథ్యంలో పారామిలటరీ బలగాలను మోహరించారు. ప్రస్తుతం అరెస్టు చేసిన నేతలకు గతంలో ప్రభుత్వం భద్రత కల్పించింది. వేర్పాటువాద నేతలకు భద్రతను తొలగించటంతో పాటు వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.