జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో కేబుల్ టీవీ ప్రసారాల నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాది బుర్హాన్‌వానిని భద్రతాదళాలు హతమార్చిన అనంతరం వారం రోజులుగా జమ్ము-కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వదంతులు వ్యాపించడంతో చాలా ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్, ఇంటర్నెర్ సేవలను ఇదివరకే నిలిపివేయగా తాజాగా కేబుల్ టీవీ ప్రసారాలను సైతం అధికారులు నిలిపివేశారు. ఉద్రిక్తతల కారణంగా పలు ప్రాంతాల్లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. పోలీసులపైకి రాళ్లు విసురుతూ పలు చోట్ల ఆందోళనకారులు ఘర్షణలకు దిగుతున్నారు. ఘర్షణల్లో గాయపడి మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ‘గ్రేటర్ కాశ్మీర్’ పత్రిక కార్యాలయంపై పోలీసులు దాడి చేసి 5లక్షల ప్రతులను స్వాధీనం చేసుకుని , ముగ్గురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారని సమాచారం.