తెలంగాణ

ఇది అనైతికం, అసెంబ్లీలో నిలదీస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలీనంపై జానారెడ్డి
హైదరాబాద్, మార్చి 11: తెలంగాణ రాష్ట్ర సమితిలో 12 మంది టిడిపి ఎమ్మెల్యేలు విలీనమైనట్లు స్పీకర్ ఎస్. మధుసూదనాచారి నిర్ణయం తీసుకోవడం పట్ల విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్ నిర్ణయంతో రాజ్యాంగం, చట్టం, నైతిక విలువలు పతనమవుతున్నాయని కాంగ్రెస్ నేత జానారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ విమర్శించారు. ఆ చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ పిటీషన్లు దాఖలైతే వాటిని పరిష్కరించకుండా, ఫిరాయించిన ఎమ్మెల్యేలను విలీనమైనట్లుగా గుర్తించడం సమంజసం కాదన్నారు. దీనిని తాము అసెంబ్లీలో ప్రశ్నిస్తామని ఆయన చెప్పారు.
ఫిరాయింపులే అభివృద్ధి కాదు: లక్ష్మణ్
బిజెపి నేత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపులను ప్రోత్సహించడమే అభివృద్ధి అనిపించుకోదని విమర్శించారు.