జనాంతికం - బుద్దా మురళి

ఉగ్రవాద కామెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అంతగా నవ్వు తెప్పిస్తున్న వార్తలేమిటో? ఆంధ్రా అసెంబ్లీలో బుగ్గున జోకులా? అంబటి రాంబాబు విసుర్లా?’’
‘‘అవేమీ కాదు, అవి ఎప్పుడూ ఉన్నవే..’’
‘‘మరింకేంటి? వైఎస్‌ఆర్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చంద్రబాబు చెప్పిన దాని గురించా?’’
‘‘2018లో అమరావతిలో ఒలింపిక్స్ అన్నా నవ్వలేదు. నర్సరావుపేటను ప్రపంచంలో టాప్ టెన్ నగరాల్లో ఒకటిగా మారుస్తానని అన్నా సీరియస్‌గా విన్నా.. కానీ నవ్వలేదు. బాబు రొటీన్ ప్రకటనలు మామూలే! బాబుగారి మాటలు, లోకేశ్ ట్వీట్లు నిత్యనూతనంగా ఎప్పుడూ మనల్ని అలరిస్తునే ఉంటాయి. అవి కాదులే’’
‘‘ఔను.. నువ్వు చెబితే గుర్తుకు వచ్చింది. నర్సరావుపేట ర్యాంక్ ఇప్పుడు ప్రపంచపు టాప్ టెన్ నగరాల్లో ఎన్నో స్థానం?’’
‘‘ఏమో? నాకేం తెలుసు. బాబునో, లోకేశ్‌నో అడిగితే చెబుతారు.’’
‘‘ఔను.. లోకేశ్‌కు, బాబుకు మధ్య మాటలు లేవా?’’
‘‘నీకెందుకొచ్చింది ఆ అనుమానం?’’
‘‘బాబు పాలనలో విద్యుత్ చార్జీలు తగ్గించమని రైతులు ఆందోళన చేస్తే బషీర్‌బాగ్ వద్ద కాల్పులు జరిపి రైతుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న సంగతి గుర్తుంది కదా? లోకేశ్ మొన్న ట్విట్టర్‌లో రైతులపై జరిగిన కాల్పుల గురించి చెప్పి అందరికీ బషీర్‌బాగ్ సంఘటన గుర్తు చేశారు. తండ్రిపై ఎంత కోపం ఉంటే మాత్రం ఇలాంటివి గుర్తు చేయడం అన్యాయం కదూ..’’
‘‘ఆయన ఎందుకా సంఘటన గుర్తుచేశాడో వదిలేయ్!’’
‘‘మరి ముసిముసిగా నవ్వుకుంటూ చదివిన ఆ వార్తలేమిటో మాకూ చెబితే మేమూ నవ్వుతాం కదా? ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శల గురించా?’’
‘‘జాలి కలుగుతుంది.. కానీ నవ్వెందుకొస్తుంది?’’
‘‘మరి ఇంక దేని గురించి? రెండవ సారి ప్రధాన మంత్రి అయ్యాక విదేశీ పర్యటనలు తగ్గించిన మోదీ గురించా? ఆ.. తెలిసింది. మహిళా తహశీల్దార్ ఇంట్లో 90 లక్షల నగదు దొరకిందనే కదా?’’
‘‘ఆ ఉత్తమ తహశీల్దార్ లావణ్య అమాయకత్వంపై జాలి వేస్తుంది కానీ నవ్వు ఎందుకొస్తుంది? లంచాలకు అవకాశం ఉన్న ప్రతి వారూ లావణ్యలే. బయటపడకుండా అంతా బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టుకుంటారు. పాపం ఆమెకు నమ్మకస్తులు ఎవరూ లేనట్టుంది. అందుకే అంత పెద్ద మొత్తం నగదు ఇంట్లో పెట్టుకుంది. ఈ రోజుల్లో ఇంత అమాయకులెవరైనా ఉంటారా? పాపం ఎలా బతుకుతుందో? ఇలాంటి వ్యవహారాల్లో సలహాలిచ్చే మిత్రులు లేకపోవడం నిజంగా బాధాకరమే. ఈ కేసు నుంచి బయటపడే సరికి ఆమెకు బాగా అనుభవం వస్తుందిలే!’’
‘‘లావణ్య గురించి కాదంటావు. మోదీ గురించి కాదంటావు. మరి ఇంకా? ’’
‘‘ఆంధ్ర, తెలంగాణ కాదు..’’
‘‘అంటే ప్రకటనలతో మన వారిని మించి నవ్వులు పండిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయా?’’
‘‘గడ్డికేసులో లాలూప్రసాద్ జైలుకు వెళ్లిన తరువాత జాతీయ స్థాయిలో కామెడీ రాజకీయాలే కనుమరుగయ్యాయి. గతంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పార్లమెంటు జరిగినప్పుడు రోజుకో వేషంతో మీడియాలో నిలిచాడు కానీ లాలూను అందుకోలేక పోయాడు.’’
‘‘లాలూతో శివప్రసాద్‌కు పోలికేంటి? లాలూ సహజ నటుడు, శివప్రసాద్ కృత్రిమ నటుడు. లాలూ నటన ముందు శివప్రసాద్ నటన తేలిపోతుంది. అసలు పోలికే లేదు. అదేదో నక్కకి నాగలోకం.. అంటారు కదా? అలా ఆకాశానికి, భూమికి ఉన్నంత అంతరం ఉంటుంది’’
‘‘వీరెవరూ కాకపోతే ఇంకెవరు నిన్ను నవ్వుల్లో ముంచెత్తిన నాయకులు’’
‘‘నాయకులు కాదు. నన్ను ఇంతగా నవ్వించిన వార్త.. ’’
‘‘ఇందులో నవ్వడానికేముంది? ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సరుూద్‌ను పాకిస్తాన్‌లో అరెస్టు చేశారట! నరరూప రాక్షసుడిగా అమాయకుల ప్రాణాలను తీసిన వాడిని అరెస్టు చేస్తే నీకు నవ్వు వస్తుందా? నువ్వు రోజురోజుకూ క్రూరంగా తయారవుతున్నావ్! ఉగ్రవాదులను విడుదల చేయాలంటూ కొవ్వొత్తుల ప్రదర్శన జరిపే వారికి నీకు తేడా లేకుండా పోతోంది. నువ్వేమన్నా అనుకో- నా మిత్రుడివైనా నీ పద్ధతి నాకేం నచ్చడం లేదు.’’
‘‘ఆగవోయ్.. ఈ వార్త చూసి నవ్వాను అన్నాను కానీ అరెస్టు చేయడం తప్పని కానీ, ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో మర్యాదలు చేయాలని, వారికి అవార్డులు ఇవ్వాలని నేనేమన్నా అన్నానా? ’’
‘‘అలా అన్న వారికి, నీకు తేడా ఏముంది?’’
‘‘నామీద అనవసరంగా ముద్ర వేయకు. నేనెందుకు నవ్వానో చెబుతా విను..’’
‘‘వద్దు- నీ బుద్ధి తెలిసిపోయింది. ఇంకా సమర్థించుకోవడానికి ప్రయత్నించకు..’’
‘‘నువ్వు అడిగినప్పుడు చెప్పలేదనే కదా? ఇప్పుడు చెబుతానని బతిమిలాడుతున్నా వినడం లేదు’’
‘‘ఇంకేం వినాలి? మేధావులనన్నా క్షమించవచ్చు కానీ నీలాంటి వారిని క్షమించలేం..’’
‘‘అబ్బా- ఇంకా ఆలస్యం చేస్తే నామీద నువ్వు వేసే ముద్ర నిజమే అనుకుంటారు’’
‘‘ఇంకా బుకాయించాలని చూస్తున్నావా?’’
‘‘బాబోయ్! నీ కోసం కాకపోయినా సమస్త ప్రజల కోసం నేనెందుకు నవ్వానో చెప్పి తీరాలి. ముంబయి పేలుళ్ల సూత్రధారి అరెస్టు వార్త చదివి నవ్వింది నిజమే కానీ. అందులో ఏముందో ఒకసారి చూడు.’’
‘‘ఏముంది?’’
‘‘ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి, జమాత్-ఉద్ దవా నేత హఫీజ్‌ను పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక దళం (సీటీడీ) అరెస్టు చేసిందట! ఎందుకో ఇది చదివాక నవ్వు ఆపుకోలేకపోయాను. పాకిస్తాన్‌ను ప్రపంచం ఉగ్రవాద దేశంగా ఎప్పటి నుంచో చూస్తోంది. అలాంటిది ఆ దేశంలో ఏకంగా ఉగ్రవాద వ్యతిరేక దళం కూడా ఉందట! అంటే ఇదేం చేస్తుందో? ఉగ్రవాదులకు శిక్షణ, నిధులు సమకూర్చడం వంటి పనులు చేస్తుందేమో? అనిపించింది.. అందుకే నవ్వు వచ్చింది’’
‘‘ఇంకా ఈజీగా అర్థం కావాలి అంటే.. మధ్యనిషేధ అమలు శాఖకు ప్రధానమైన పని మద్యం ఆదాయం పెంచడం. రాష్ట్రాలకు మద్యంపై పన్నులే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. కానీ ఆ శాఖ పేరు మాత్రం మధ్యనిషేధ అమలుశాఖ అని ఉంటుంది. పాక్‌లో కూడా అంతేనేమో.. ప్రపంచంలోని మూలమూలలకు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న పాకిస్తాన్‌లో ఉగ్రవాద వ్యతిరేక దళం ఉండడం కలికాలం వింతే కదా? బహుశా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ సైతం తమ దేశంలోని ఉగ్రవాద వ్యతిరేక దళం పేరు విని నవ్వుకుని ఉంటాడు.’’
*

buddhamurali2464@gmail.com