ఆంధ్రప్రదేశ్‌

వైకాపా పాలనపై జనసేన నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: వైకాపా ప్రభుత్వ వందరోజుల పాలనపై జనసేన నివేదిక రూపొందించింది. ఈమేరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివేదికను విడుదల చేశారు. ప్రభుత్వానికి పారదర్శకత, దార్శనికత లోపించాయని నివేదికలో పేర్కొంది. ప్రణాళికాబద్ధంగా, నిర్మాణాత్మకంగా పని చేయాలని జనసేన సూచించింది. ఈ సందర్భంగా జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించటంలో విఫలమైందని విమర్శించారు. పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ వంద రోజుల పాలనలో ఇష్టం వచ్చినట్లుగా జీవోలు ఇచ్చారని ఆరోపించారు. మౌఖిక ఆదేశాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేశారన్నారు. రెండు లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అర్ధంతరంగా ఆపేశారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నీతి అయోగ్ కూడా ఆందోళన వ్యక్తం చేసిందని గుర్తు చేశారు.