రాష్ట్రీయం

2 నుంచి జన్మభూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటిష్ఠంగా ‘మా వూరు’ కార్యక్రమం
ప్రతి జిల్లాకూ ఇద్దరు సీనియర్ అధికార్ల నియామకం

హైదరాబాద్, డిసెంబర్ 26: రాష్ట్రంలో మూడో విడత జన్మభూమి కార్యక్రమం వచ్చే నెల 2వ తేదీ నుండి నిర్వహించనున్నారు. ఈసారి మరింత పటిష్టంగా జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్రంలో పేదల సంఖ్యను గుర్తించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం జిల్లా అధికారులతో సమన్వయం చేసేందుకు ఇద్దరు సీనియర్ అధికారులను ఇన్‌ఛార్జిలుగా నియమించింది. అందులో ఒకరు కార్యదర్శి స్థాయి అధికారి కాగా, మరొకరు ఐఎఫ్‌ఎస్ అధికారి ఉంటారు. పేరికంపై గెలుపు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, స్వచ్ఛాంద్ర ప్రదేశ్ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సంపూర్ణ ఫలితాలను సాధించేందుకు ఈ జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని రూపొందించారు. రానున్న రోజుల్లో జన్మభూమి-మా ఊరు కమిటీలకు కీలక బాధ్యతలను సైతం అప్పగించనున్నారు. వారు నిబద్ధతతో పనిచేస్తే సత్ఫలితాలు సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులు, లక్ష్యాలను ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు నిర్దేశించింది. ప్రభుత్వ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని జన్మభూమి కమిటీలకు ఈ నెల 30వ తేదీన శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ప్రతి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా జన్మభూమి -మా ఊరు కమిటీలు చొరవ తీసుకునేలా చూడనుంది. త్వరలో జన్మభూమి మా ఊరు కమిటీలకు ఫుడ్ అడ్వయిజరీ బాధ్యతలు కూడా అప్పగించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఏడు మిషన్ల ఉద్ధేశ్యం కూడా ఈ కమిటీలు ద్వారా జనంలోకి తీసుకువెళ్లనున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే తక్షణం పరిష్కరించేందుకు జన్మభూమి మా ఊరు కమిటీలు ముందుండనున్నాయి. వంద శాతం ఆస్పత్రి ప్రసవాలు, జీరో డ్రాపవుట్లు, మాతా శిశు మరణాలు నియంత్రణ, నూరు శాతం టాయిలెట్ల నిర్మాణం, బాల్య వివాహాల నియంత్రణ, ప్రతి కుటుంబానికి బ్యాంకు అకౌంట్ నిర్వహణ, కాల్ మనీ వ్యవహారాల అదుపు, చెట్లు పెంచే కార్యక్రమం, నర్సరీల నిర్వహణ, పూర్తిస్థాయి కంప్యూటరీకరణ, ప్రతి పంచాయతీలో ఫిర్యాదుల స్వీకరణ వంటి కార్యక్రమాలకు జన్మభూమి కమిటీలు బాధ్యత వహించనున్నాయి.
సీనియర్ అధికార్ల నియామకం
శ్రీకాకుళం జిల్లాకు కె.సునీత, బి సుందర్, విజయనగరం జిల్లాకు ఎంవి సత్యనారాయణ, కె గోపినాధ్, విశాఖకు జె శ్యామలరావు, ఎన్ ప్రదీప్‌కుమార్, తూర్పుగోదావరికి కె ఎస్ జవహర్‌రెడ్డి, టివి సుబ్బారెడ్డి, పశ్చిమగోదావరికి జి వాణి మోహన్, ఎం రవికుమార్, కృష్ణాకు డి వరప్రసాద్, చిన్మయి కె మిశ్రా, గుంటూరుకు బి రామాంజనేయులు, విపిన్ చౌదరి, ప్రకాశం జిల్లాకు బి ఉదయ లక్ష్మి, ఎస్ శ్రీ శ్రవణన్, నెల్లూరు జిల్లాకు జి అనంతరాము, అనిల్ కుమార్ వౌర్యలను నియమించారు. చిత్తూరుకు జెసి శర్మ, పివి చలపతిరావు, కర్నూలుకు ఎ ఆర్ సుకుమార్, జెఎస్‌ఎన్ మూర్తి, అనంతపురానికి సుమితా దావ్రా, ఎస్ ఎస్ శ్రీ్ధర్, కడప జిల్లాకు ఆర్ పి సిసోడియా, ఎండి మైదీన్‌లను నియమించారు. రెవిన్యూ అధికారులు కొంత మందిని సిద్ధంగా ఉండమని కూడా ప్రభుత్వం ఆదేశించింది. అందులో కెఆర్‌బిహెచ్‌ఎన్ చక్రవర్తి, లవ్ అగర్వాల్, బి కిశోర్, ఐ ఎస్ శ్రీనరేష్, ఎం గిరిజా శంకర్, జి రవిబాబు, పి వెంకటరామి రెడ్డి, ఎం జగన్నాధం, ఐ శామ్యూల్ ఆనంద కుమార్, కె వి సత్యనారాయణ, పి ఉషారాణి, ఎం పద్మ, కె శారదాదేవి, ఎంవి శేషగిరి బాబు, డి మురళీధర్‌రెడ్డి తదితరులున్నారు.