కృష్ణ

ముచ్చటగా మూడవసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నేటి నుండి జిల్లాలో జన్మభూమి గ్రామసభలు
* జిల్లా ప్రత్యేక అధికారులుగా వర ప్రసాద్, మిత్రా నియామకం
* నాలుగు రెవెన్యూ డివిజన్‌లకు ఐఎఎస్ స్థాయి ప్రత్యేక అధికారులు
మచిలీపట్నం, జనవరి 1: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముచ్చటగా మూడవసారి జన్మభూమి కార్యక్రమానికి సిద్ధమైంది. ప్రజల వద్దకు పాలన, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిర్వహించనున్న ‘జన్మభూమి - మా ఊరు’ గ్రామసభలు జిల్లాలో నేటి నుండి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు జరగనున్న గ్రామసభల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జన్మభూమి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను జిల్లా, డివిజన్ స్థాయిలలో ప్రత్యేక అధికారుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఐఎఎస్ అధికారి వరప్రసాద్, ఐఎఫ్‌ఎస్ అధికారి మిత్రాలను జిల్లాకు ప్రత్యేక అధికారులుగా నియమించారు. బందరు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి రమాశంకర్ నాయక్, నూజివీడుకు డి శ్రీ్ధర్, గుడివాడకు బి రామాంజనేయులు, విజయవాడకు సుమితా డావ్రా జన్మభూమి ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల జన్మభూమిలో రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించారు. ఆయా విడతల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం జిల్లాలో 95వేల మందిని అర్హులుగా గుర్తించి నూతన రేషన్ కార్డుల పంపిణీకి సంసిద్ధమైంది. గ్రామసభల్లో ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా పౌర సరఫరాల శాఖ ద్వారా అందిస్తున్న చంద్రన్న సంక్రాంతి కానుకను కొత్త రేషన్ కార్డుదారులకు కూడా అందించనున్నారు. ఫిబ్రవరి నెల నుండి నెల వారీ చౌకధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ చేయనున్నారు. గత రెండు విడతల్లో వచ్చిన అర్జీల పరిష్కార వివరాలను కూడా మూడవ విడత గ్రామసభల్లో ప్రజలకు వివరించనున్నారు. గత రెండు విడతల్లో జరిగిన జన్మభూమిలో 5లక్షల 80వేల 177 అర్జీలు రాగా ఇందులో 5లక్షల 64వేల 43 అర్జీలు పరిష్కారానికి నోచుకున్నాయి. మరో 16వేల 134 అర్జీలను పరిష్కరించాల్సి ఉంది.

భక్త్భివంతో పరవశించిన పెదముత్తేవి
కూచిపూడి, జనవరి 1: భక్తులు రాగయుక్తంగా ఆలపించిన హనుమాన్ చాలీసా పారాయణలతో పంచ లక్ష్మీ నారాయణ క్షేత్రమైన పెదముత్తేవి భక్తి భావంతో పులకించింది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీకృష్ణాశ్రమంలో ధనుర్మాస మహావ్రతాలలో భాగంగా శుక్రవారం ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం, కమల దంపతుల పర్యవేక్షణలో ఉదయం నుండి సాయంత్రం వరకు 108 విడతలు హనుమాన్ చాలీసా పారాయణ జరిపారు. శ్రీహనుమంతునికి పూజలు జరిపి తమలపాకులతో చాలీసా పారాయణ చేసి వాటిని శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారికి సమర్పించారు. ఆశ్రమంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రజలతో మరింతగా మమేకమవుతాం...
* వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్
మైలవరం, జనవరి 1: ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలతో మరింతగా మమేకమవుతామని వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా శుక్రవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో, పార్టీ నేత శీలం కోటిరెడ్డి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీ లేని పోరాటం చేయాలని, ప్రజల పక్షాన ఉండి వారి సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పామర్తి శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ కరీం, ఎంపిటిసి షేక్ అబ్దుల్ రహీం, పార్టీ నేతలు నాగిరెడ్డి, సాంబశివారెడ్డి, లంకె అంకమోహనరావు, మందా జక్రి, నోవా, ఆజాద్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ, వైకాపా కార్యకర్తల పరస్పర దాడులు
నందివాడ, జనవరి 1: మండలంలోని రామాపురంలో పాత కక్షలు పురస్కరించుకుని తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఒక వర్గంపై మరొక వర్గం కత్తులతో దాడులు చేసుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి జరిగింది. నందివాడ ఎఎస్‌ఐ బసవరాజు కథనం ప్రకారం గతంలో డబ్బులు పంపిణీ విషయమై రెండు వర్గాలు తగాయిదా పడి ఒక వర్గంపై మరొక వర్గం దాడులు చేసుకుని గాయాలపాలయ్యారు. దీనిపై అప్పట్లో కేసులు నమోదు చేయడం ముద్దాయిలు కోర్టు నుండి బెయిల్ మీద బయటకు రావడం జరిగాయి. అప్పటి నుండి ఒకరిపై మరొకరు కక్షలు పెంచుకొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల క్రిస్మస్ , జనవరి ఫస్ట్‌కు తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు బ్యానర్లను గ్రామంలోని సెంటర్లలో ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో ఆటోలు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఒక వర్గంపై మరొక వర్గం కత్తులతో దాడులు చేసుకుని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీకి చెందిన మండ్రు కృష్ణ టీడీపీకి చెందిన పొట్ల ఆరోను, దేవసాయం, పీటరు, మేడేపల్లి సంసోన్, బొడ్డు సుందరరావు, బొడ్డు ప్రకాష్ మీద ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన మేడేపల్లి జయరాజ్, వైఎస్సార్ సీపీకి చెందిన మండ్రు కృష్ణ, మండ్రు వెంకటేశ్వరరావు, సాగర్, వెన్నా రాజేష్, వెన్నా మరియన్న, మేడేపల్లి ప్రసాద్ తదితరులు 9మంది మీద ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు వెన్నా మరియన్న, రాజేష్ తీవ్ర గాయాల పాలవటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోచికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలోచికిత్స పొందుతున్నారు. రెండు వర్గాలపై హత్యాయత్నం, దాడి కేసులు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎఎస్‌ఐ చెప్పారు.

కొత్త సంవత్సరంలో మరిన్ని ఆకర్షణీయమైన సంక్షేమ పథకాలు
అవనిగడ్డ, జనవరి 1: ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో భాగంగా రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా నూతన సంవత్సరంలో మరిన్ని ఆకర్షణీయమైన సంక్షేమ పథకాలు అమలులోకి రానున్నాయని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. అధికారులు, అనధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బుద్ధప్రసాద్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా ఆధునిక వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి యాసం చిట్టిబాబు, గాజుల మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి నూతన సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి రాజా, ఆలయ ప్రధాన అర్చకులు బద్దుపవన్ కుమార్ శర్మ, వేద పండితులు నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ తదితరులు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ సిపి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సింహాద్రి రమేష్ కేక్ కట్ చేయగా పార్టీ నాయకులు కె నరసింహరావు, పృధ్విరాజ్, ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. డియస్‌పి కార్యాలయంలో జరిగిన వేడుకల్లో డియస్‌పి సయ్యద్ ఖాదర్ బాషా కేక్ కట్ చేశారు. సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. స్థానిక ఎల్‌ఐసి కార్యాలయంలో బ్రాంచ్ మేనేజర్ సుధాకర్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. జీవన్ అక్షయ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. డిసెంబర్ నెలలో అత్యధిక సంఖ్యలో ఎల్‌ఐసి పాలసీలు చేసిన 15 మంది ఏజెంట్లను ఘనంగా సత్కరించారు.

కావాలనే గొడవలు సృష్టిస్తున్న టిడిపి
గుడివాడ, జనవరి 1: నందివాడ మండలం రామాపురంలో టిడిపి నాయకులు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. పాత కక్షల నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి జరిగిన గొడవల్లో గాయపడిన వైసీపి కార్యకర్తలను శుక్రవారం స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ మొండ్రు వెంకటేశ్వరరావు వర్గానికి చెందిన కార్యకర్తలను టిడిపికి చెందిన నాయకులు, కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. గతంలో ఒకసారి వైసీపి కార్యకర్తలపై టిడిపి కార్యకర్తలు దాడి చేస్తే తమ పార్టీ కార్యకర్తల పైనే హత్యాయత్నం కేసులు నమోదు చేసి జైలుకు పంపారని, టిడిపి కార్యకర్తలపై నామమాత్రంగా 327 సెక్షన్ కింద కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారన్నారు.

కృష్ణా వర్సిటీ హ్యాండ్‌బాల్ పురుషుల జట్టు
విజయవాడ , జనవరి 1: కృష్ణా విశ్వవిద్యాలయం హ్యాండ్‌బాల్ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. వి.రవి ప్రకటించారు. ఎంపికైన ఈ జట్టు 4 నుండి 8వ తేదీ వరకు అలగప్పా విశ్వవిద్యాలయంలో జరుగనున్న దక్షిణ మండల అంతర విశ్వవిద్యాలయాల హ్యాండ్‌బాల్ పురుషుల టోర్నీలో పాల్గొంటుందని పేర్కొన్నారు. జట్టుకు ఎస్.శివదుర్గారావు, జి.జయరామ్, ఎం.కృష్ణ (శాతవాహన కళాశాల), పి.శ్రీనివాసరావు, ఎస్.్భర్గవ్‌సాయి, వి.జగదీష్, బి.సాయికుమార్ (కెబిఎన్ కళాశాల), ఎ.చందు, కె.సురేష్, ఎం.అరిఫ్ హుస్సేన్ (ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల), ఎం.శ్రీకాంత్ (డా.జాకీర్ హుస్సేన్ కళాశాల), పి.్భనుమూర్తి (సప్తగిరి డిగ్రీ కళాశాల), ఎస్.సురేష్ (ఎంవిఆర్ డిగ్రీ కళాశాల, నూజివీడు), టి.హేమంత్‌కుమార్ (డిఎఆర్ కళాశాల, నూజివీడు)లు ఎంపికయ్యారు. కెబిఎన్ కళాశాల వ్యాయామ విద్యా సంచాలకులు హేమచంద్రరావు మేనేజర్‌గా వ్యవహరిస్తారు. ఎంపికైన జట్టు సభ్యులను వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డా.ఎన్.శ్రీనివాసరావు, వ్యాయామ విద్యా సంచాలకులు, ఎం.కోటేశ్వరరావు, సురేంద్రలు అభినందించారు.

9 నుండి గుడివాడలో ఆర్‌జికెఎ జాతీయ స్థాయి పోటీలు
విజయవాడ , జనవరి 1: క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గుడివాడ ఎన్‌టిఆర్ స్టేడియంలో ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు జాతీయస్థాయి ఆర్‌జికెఎ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును రావాలని శాప్ చైర్మన్ పిఆర్ మోహన్ శుక్రవారం కలిసి విజ్ఞప్తి చేశారు. దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని మోహన్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రారంభించిన స్టేడియం 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయస్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని, అథ్లెటిక్స్, వాలీబాల్, తైక్వాండో క్రీడాంశాల్లో జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోటీల ఏర్పాట్లలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్), ఎన్‌టిఆర్ స్టేడియం పాలకమండలి కలిసి స్టేడియం 25 వసంతాల ఉత్సావాలు ఘనంగా నిర్వహించడానికి ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. సిఎంను కలిసిన మోహన్ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలిపారు.