బిజినెస్

జపాన్‌కు ‘బాలెనో’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడాదికి 30 వేల కార్ల ఎగుమతి
‘మారుతీ’ చైర్మన్ భార్గవ వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: జపాన్‌కు త్వరలో ‘బాలెనో’ కార్లను ఎగుమతి చేయనున్నట్లు మారుతీ సుజుకీ సంస్థ చైర్మన్ ఆర్‌సి.్భర్గవ వెల్లడించారు. న్యూఢిల్లీలో శనివారం ఇండో-జపాన్ బిజినెస్ లీడర్స్ ఫోరం సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, ఈ విషయాన్ని వెల్లడించారు. ఎగుమతుల లక్ష్యం ఎంతన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, జపాన్‌కు ఆటోమొబైల్ ఎగుమతులు జరపడం అంత సులువైన విషయమేమీ కాదని, అయినప్పటికీ ఏడాదికి 20 వేల నుంచి 30 వేల కార్లను ఎగుమతి చేయాలని భావిస్తున్నామని తెలిపారు. కాగా, భారత్‌లో విద్యుత్ సహా వౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడులు పెడతామని జపాన్ సంస్థలు ప్రకటించాయని అపోలో టైర్స్ సంస్థ చైర్మన్ ఓంకార్ ఎస్.కన్వర్ వెల్లడించారు. సాంకేతికంగా ఎంతో పురోభివృద్ధి సాధించిన జపాన్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) మాజీ అధ్యక్షుడు అజయ్ శ్రీరామ్ అన్నారు. భారత్, జపాన్ మధ్య మైత్రీ బంధం ఎంతగానో బలపడిందని, భారత్‌లో పెట్టుబడులకు ఇది ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, ఐసిఐసిఐ బ్యాంకు ఎండి చందా కొచ్చర్, ఎస్సార్ గ్రూపు చైర్మన్ శశి రుయియా, సిఐఐ అధ్యక్షుడు సుమిత్ మజుందార్, భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (్ఫక్కీ) ప్రెసిడెంట్ జ్యోత్స్న సూరి, అసోచామ్ అధ్యక్షుడు సునీల్ కనోరియా తదితరులు కూడా ఇండో-జపాన్ బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు.