జాతీయ వార్తలు

హర్యానాలో కొనసాగుతున్న జాట్‌ల ఆంథోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:ఒబిసిలుగా రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ జాట్ కులస్థులు చేపట్టిన ఆందోళన వరుసగా ఏడోరోజూ కొనసాగుతోంది. హర్యానాలోని రోహ్‌తక్ సహా ఎనిమిది జిల్లాల్లో పరిస్తితి అట్టుడుకుతోంది. ఎక్కడికక్కడ రైళ్లు, ఇతర రవాణా సౌకర్యాలు స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటివరకు జరిగిన అల్లర్లు, కాల్పుల్లో ఎనిమిది మరణించారు. దాదాపు 700 రైళ్లు రద్దయ్యాయి. కర్ఫ్యూ విధించి సైన్యాన్ని రప్పించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. మరోవైపు దేశ రాజధాని దిల్లీకి నీటిసరఫరా చేసే వ్యవస్థను ఆందోళనకారులు ధ్వంసం చేయడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో దిల్లీలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. కాగా ఆదివారం మధ్యాహ్నం జాట్ సంఘాల ప్రతినిధులతో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమావేశం కానున్నారు.