జాతీయ వార్తలు

మావోయిస్టుల మెరుపుదాడిపై రాజ్‌‌నాథ్ ఖండన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై మావోయిస్టుల మెరుపుదాడిపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సుక్మా జిల్లాలో కిస్తారాం-పలోడీ జిల్లాల మధ్య జరిగిన ఐఈడీ పేలుడుపై ఆయన మంగళవారం ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ దుర్ఘటనలో అమరులైన తొమ్మిది మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు నివాళులర్పించారు. గాయపడిన జవాన్లు సత్వరం కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఆర్‌పీఎఫ్ ఇండియా డీజీతో ఈ దుర్ఘటనపై మాట్లాడినట్లు, వెంటనే ఛత్తీస్‌గఢ్ వెళ్ళాలని ఆయనను ఆదేశించినట్లు తెలిపారు.