జాతీయ వార్తలు

ఆర్భాటంగా జయలలిత బర్త్‌డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: అన్నాడిఎంకె పార్టీ అధినేత్రి, తమిళనాడు సిఎం జయలలిత 68వ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో వేడుకల్ని గతంలో ఎన్నడూ లేనంతగా బుధవారం నాడు అత్యంత కోలాహలంగా నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు తమ చేతులపై జయలలిత బొమ్మను పచ్చబొట్లు వేయించుకుంటున్నారు. ఆమె బొమ్మ ఉన్న టీషర్టులను ధరించి సందడి చేస్తున్నారు. అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్ల పంపిణీ, ఆలయాల్లో పూజలు వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 68వ పుట్టినరోజు సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా 68 లక్షల మొక్కలు నాటాలని కార్యకర్తలు నిర్ణయించారు. ఈ రోజు పుట్టిన ఆడశిశువులందరి పేరిట పదివేల రూపాయల నగదును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని, బంగారు ఉంగరాలు అందజేస్తామని, అందరికీ అమ్మ కాంటీన్లలో ఉచితంగా భోజనం పెట్టిస్తామని కొందరు పార్టీ నేతలు ప్రకటించారు. జయలలితే తమకు ప్రత్యక్ష దైవమని అభిమానులు స్వీట్లు పంచుకుంటున్నారు.