జాతీయ వార్తలు

నామినేషన్ దాఖలు చేసిన జయశంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జూలై 5వ తేదీన జరుగునున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జయశంకర్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దౌత్యవేత్త, కేంద్ర విదేశీ వ్యవహారాల మాజీ కార్యదర్శి అయిన జయశంకర్‌ను మోదీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు విదేశీ వ్వవహారాల శాఖను కట్టబెట్టారు. ఇటీవల బీజేపీలో చేరారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆరు నెలల్లో ఎంపీగా ఎన్నిక కావల్సి ఉంది. లోకసభ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన కేంద్ర మంత్రులు అమిత్‌షా, స్మృతి ఇరానీ రాజ్యసభకు రాజీనామా చేశారు. ఈ స్థానాలకు ఇపుడు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.