సబ్ ఫీచర్

మూడేళ్లు.. మూడు దారులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంలో మోదీ, తెలుగురాష్ట్రాల్లో ఇద్దరు ‘చంద్రుల’ పాలనకు మూడేళ్లు ముగిశాయి. ఈ ముగ్గురూ ముగ్గురే. దారులు వేరైనా పరిపాలన తీరుతెన్నులన్నీ దాదాపు ఒకటే. నిజానికి ఈ పాలనా పద్ధతులన్నీ మోదీ, కేసీఆర్‌కు నేర్పింది చంద్రబాబు నాయుడే. మోదీ కంటే సీనియర్ అయిన బాబు తన తొమ్మిదేళ్ల జమానాలో సర్వం ‘సిఎంఓ’గా మార్చేయగా, గుజరాత్ సీఎంగా మోదీ అదే బాట పట్టి, ఇప్పుడు దానినే దిల్లీలో విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కేసీఆర్‌దీ అదే దారి. అంటే- వీరి కింద పనిచేసే ఏ మంత్రికీ సర్వాధికారాలుండవు. సర్వం సిఎంఓ, పిఎంఓనే. ఇప్పుడు హస్తినలో, తెలుగురాష్ట్రాల రాజధానుల్లో జరుగుతున్న పాలన ఇదే.
దేశ రాజధానితో పెద్దగా పరిచయం లేకపోయినా దిల్లీని కంటిచూపుతో శాసించే స్థాయికి ఎదిగిన నరేంద్రుడిని చూసి జాతీయ, ప్రాంతీయ పార్టీలు వణికిపోతున్నాయి. గతంలో అక్రమాలకు మారుపేరైన ‘కేంద్రం పాలన’ను మోదీ అవినీతి రహితంగా మార్చడంతో ఆయనపై బురద చల్లేందుకు విపక్షాలకు అవకాశమే లేకుండా పోయింది. అందుకే అవి చచ్చు పుచ్చు ఇచ్చకాలతో లౌకికవాద కార్డు పట్టుకునే ఊరేగుతున్నాయి. మొన్నటి యుపి ఎన్నికల్లో ఆ ఆశ కూడా చచ్చిపోయింది. ఇక మోదీని విడిగా ఓడించడం కష్టమని ఆలస్యంగా తెలుసుకున్న ‘అనాథలం’తా, సంఘం పెట్టుకుని పోరాడే పనిలో పడ్డారు. అదైనా సక్రమంగా అఘోరించిందా? అంటే అదీ లేదు. బిహారు నితీష్‌బాబు తాను రాను పొమ్మనడమే కాదు, జాతీయ రాజకీయాల్లోకి వచ్చేంత వెర్రివాడిని కాదంటూ ముఖానే చెప్పారు. ఇక మిగిలిన లాలూలు, అఖిలేషులు, శరద్‌యాదవులు, ఎటు బలం ఉంటే అటు చేరే వామపక్షాలు, వీరికి నాయకుడో కాదో తనకే తెలియని ‘పొలిటికల్ అమూల్ బాయ్’ రాహుల్ గాంధీ ప్రధానిపై చేస్తున్న పోరాటం- నడిచే రైలులో పరిగెత్తడం లాంటిదే!
ఇప్పట్లో మోదీకి గానీ, బిజెపికి గానీ విపక్షాల వల్ల వచ్చే గత్తరేమీ లేదు. సత్తెకాలపువాజపేయి హయాంలో చక్రం తిప్పిన చంద్రబాబు ఇప్పుడు దిల్లీ వైపు చూసే పరిస్థితి లేదు. ఆయనకున్న సమస్యలు ఆయనవి. ఇచ్చినవి తీసుకోవడం వినా మునుపటిలా గర్జించే వీలు లేదు. అందుకే బాబు మునుపటి మాదిరిగా చీటికీ మాటికీ దిల్లీ వెళ్లి హడావుడి చేసి, జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడం మానేశారు. ఎందుకంటే పైనున్నది మోదీ కాబట్టి!
తెలంగాణ సిఎం కేసీఆర్ వ్యూహకర్త, చతురుడే అయినప్పటికీ బాబు మాదిరి ఆయనకున్న సమస్యలు ఆయనకున్నాయి. ఇద్దరికీ అసెంబ్లీ సెగ్మంట్ల సంఖ్య పెరగాలి మరి! రాష్టస్థ్రాయిలో తనకెవ్వరూ పో టీ లేకుండా చూసుకుంటూనే, దిల్లీలో మోదీకి మద్దతునివ్వాల్సి న పరిస్థితి కేసీఆర్‌ది. లేకపోతే ఓ వైపు అమిత్ షాను తిట్టిన నోటితోనే, రాష్టప్రతి ఎన్నికలో ఎ న్‌డిఎ అభ్యర్థికే జై కొడతాననడం ఎంతమందికి సాధ్యం? అటు బెంగాల్ బెబ్బులి మమత కూడా గర్జించేందుకు వీలులేని వాతావరణాన్ని మోదీ సృష్టించారు. బిహారీ బాబు నితీష్ కూడా సానుకూలంగానే ఉన్నారు. బిజెపిలో ‘పెద్దచేతులు’న్న ప్రముఖుల చేతులు కట్టేసిన మోదీ, వారిని పదవులతోనే తృప్తి పరుస్తున్నారు. ఇది నిజం!
నవ్యాంధ్రలో బాబు పా లన తీరు గతం కంటే ఇ పుడు భిన్నం. నాటి ‘హైటెక్’ మాటలు కట్టిపెట్టి జనంతో మమేకమవుతున్నారు. లో టు బడ్జెట్‌తో ఉన్న రా ష్ట్రా న్ని ప్రథమ స్థానానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూనే, రాజకీయంగా బలపడే ప నిలో ఉన్నారు. అందుకు తొలిసారిగా కులాలను ద న్నుగా చేసుకుంటున్నారు. గతంలో లేనివిధంగా కులాలకు కార్పొరేషన్లు పెట్టి, దండిగా నిధులిస్తున్నారు. పెద్ద పెద్ద శాఖలకు లేనంత స్థాయిలో కా పు కార్పొరేషన్‌ను ఏకంగా వెయ్యి కోట్ల నిధులిచ్చారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కూ నిధులిచ్చి ఆ వర్గాన్ని దరిచేర్చుకునే పనిలో ఉన్నారు. కానీ, విచిత్రంగా వెయ్యి కోట్లిచ్చిన కాపుకార్పొరేషన్ వందకోట్ల స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోతుంటే, వందల కోట్లు ఇచ్చిన బ్రాహ్మణ కార్పొరేషన్‌లో వెయ్యి కోట్ల ప్రచారం జరుగుతోంది. కాపు కార్పొరేషన్‌లో ఉన్న అధికార కేంద్రాల పనితీరే దానికి కారణమన్నది సొంత కులనేతల ఆరోపణ. సంక్షేమ పథకాలకు ఇప్పుడిస్తున్న ప్రాధాన్యం ఎప్పుడూ లేదు. దాదాపు అన్ని వర్గాలకూ మేలు చేసి, ఆ కృతజ్ఞతాభావంతోనే మళ్లీ గెలవాలన్నది బాబు తాపత్రయం. గతానికి భిన్నంగా బాబు మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుండటం సగటు కార్యకర్త గుండెను ఉప్పొంగించేదే.
తెలంగాణ మాదిరిగానే ఏపిలోనూ వారసత్వ రాజకీయం వర్ధిల్లుతోంది. సర్వం ‘చినబాబే’! ఎన్టీఆర్ హ యాంలో బాబు పాత్ర ఇప్పుడు లోకేష్‌లో కనిపిస్తోంది. విమర్శలను సానుకూలంగా ఆహ్వానించే నైజం బాబుదైతే, చినబాబు వైఖరి అందుకు పూర్తి భిన్నం. కారణం- వయసు, సలహాదారులు కావచ్చు. తెలంగాణలో మాదిరి ఏపిలో ప్రతిపక్ష వ్యవస్థ బలహీనంగా లేదు. ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది. దీంతో బాబు సర్వశక్తులూ విపక్ష వైసీపీపైనే సారించాల్సి వస్తోంది. తన వేగానికి తగినట్లు పనిచేయలేకపోతున్నారని తరచూ వాపోతున్న బాబు, తానే నియమించుకున్న అధికారుల ను తొలగించి, సిఎంఓను ప్రక్షాళన చేసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. ఉ మ్మడి రాష్ట్రంలో లేని ఒక ‘ప్రమాదకర’ పరిస్థితి ఇ ప్పుడు ఏపిలో కనిపిస్తోంది. పైనుంచి కింది వరకూ, దిల్లీ నుంచి గల్లీ వరకూ అంతా ఒకే సామాజికవర్గం హవా బ హిరంగంగా కనిపిస్తోంది. దా దాపు అన్ని చోట్లా వారే దర్శనమివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. కాంగ్రెస్‌పై ‘రెడ్డి’ ముద్ర బలంగా ఉన్నా మిగిలిన కులాలను సమన్వయం చేసుకోవడం వల్లే, ఆ సామాజిక వర్గంపై మిగిలిన కులాలకు ఇప్పటికీ పెద్దగా వ్యతిరేకత లేదు. ఇప్పుడు ఐటి నుంచి ఫైబర్ గ్రిడ్ వరకూ ఒకే సామాజికవర్గ నేతల హవా కళ్లకు కనిపిస్తున్న వైనం సహజంగానే ఇతర కులాలను టిడిపికి దూరం చేసేదే. గతంలో బాబు తొమ్మిదేళ్ల పాలనలో ఇది అంతర్లీనంగా కనిపించిందే తప్ప బయటపడలేదు. ప్ర స్తుతం ఆ ముసుగును నిర్భయంగా తీసేసినట్లు కనిపిస్తోంది. ‘ఎవరి ప్రమేయం, ప్రభావం లేకుండా’ బాబు సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడే పార్టీ బలంగా ఉండేదన్న భావన- గత మూడేళ్లుగా ఎందుకు బలంగా వినిపిస్తుందో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పటికీ బాబు పాలనలో సర్వాధికారులు అధికారులే తప్ప కార్యకర్త కాదు.
తిరుగుబాటు, ప్రశ్నించే తత్వానికి చిరునామా అయిన తెలంగాణ పౌర సమాజానికి ‘మత్తుమందు’ ఇవ్వడంలో కేసీఆర్ విజయం సాధించారు. ఫలితంగా ఉద్యమ స్వరం బలహీనంగా వినిపిస్తోంది. బాబు మాదిరిగా ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను ప్రశ్నించే పరిస్థితి కాదు కదా.. అసలు ఆయనను కలిసే వీలే లేదు. ఏపిలో మాదిరి తెలంగాణలోనూ ఒక సామాజికవర్గ పెత్తనమే ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో హక్కుల కోసం నినదించిన స్వరాలన్నీ ఇప్పుడు కేసీఆర్ ఆడించిన ‘పాము బుట్ట’లో పడిపోయాయి. కోదండరామ్ మాస్టారు, రేవంత్‌రెడ్డి పోరాటాలకు మీడియాలో స్థానం ఓ మూల మాత్రమే. ఆంధ్రోళ్లే అన్ని కాంట్రాక్టులూ చేస్తున్నారని, అప్పుడు విరుచుకుపడిన వారి ఏలుబడిలోనే ఇప్పుడు అదే కాంట్రాక్టర్లు సేదదీరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా కనిపించనంత అణచివేత, అప్రజాస్వామ్యం సొంత రాష్ట్రంలో కనిపిస్తోందని వాపోతున్న ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం కేసీఆర్‌కు ఓ వరం.
వారసత్వ రాజ్యంలో మిగిలిన వారంతా నామమాత్ర వశిష్టులే! ఏపిలో లోకేష్ మాదిరిగా, తెలంగాణలో కేటీఆర్, హరీష్, కవిత ఈ ముగ్గురే అన్ని ‘ఫ్రేముల్లో’నూ దర్శనమిస్తున్నారన్నది నిష్ఠుర నిజం. ఏపిలో మాదిరిగా మీడియా స్వేచ్ఛ మృగ్యంగా మారింది. ఏపిలో బాబుపై ఒంటికాలితో లేచే మీడియా సింహాలు, తెలంగాణలో పిల్లుల్లా మారిన వైచిత్రి! ఏపిలో బాబుకు జైకొట్టే మీడియా సంస్థలు ఆయన పాలనపై రాసే ధైర్యం చేస్తున్నాయి గానీ, ఆ పని కేసీఆర్ విషయంలో చూపేందుకు భయపడుతున్న పరిస్థితి. బాబుకు ఒకప్పటి ‘రాజగురువులుం గారి’ మీడియాలో ఏపి ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతిపై పుంఖానుపుంఖాల వ్యతిరేక కథనాలు వస్తుంటే, అదే తెలంగాణలో మాత్రం భూతద్దం వేసినా కనిపించవు. అయినా ఏపిలో వాటికే బాబు సర్కారు పెద్దపీట వేస్తుండటం ‘సామాజిక బంధాని’కి నిలువెత్తు నిదర్శనం. తెలంగాణలో కేసీఆర్‌ను పేజీలకు పేజీలు కొలుస్తున్న జగన్ మీడియా, అదే సొంత గడ్డ ఏపిలో బాబును తూర్పారపడుతుండటం మరో వైచిత్రి. కొన్ని కీలక హామీల అమలులో విఫలమైనా, సామాన్యుడికి ఏది కావాలో అది ఇస్తున్న కేసీఆర్‌పై ఇంకా వ్యతిరేకత ముదరలేదు. కొన్ని సామాజిక వర్గాలను అదనపు అస్త్రాలుగా చేసుకున్న లౌక్యం ఏపీలో కనిపించదు. కేసీఆర్ ఇప్పుడు చాలామందికి మానవత్వం మూర్త్భీవించిన నేతగానే కనిపిస్తున్నారు. అదెంత కాలం ఉంటుందో ఇప్పుడే చెప్పలేం.
*