తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ప్రదర్శనశాలలను ఆదివాసీకరించడం ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సంక్షేమశాఖ వైజాగ్‌లోని కాపులుప్పాడలో శ్రీ అల్లూరి సీతారామరాజు స్మారక ఆదివాసీ ప్రదర్శనశాల ఏర్పాటుకోసం ఒక సలహా సంఘాన్ని ఏర్పాటుచేసింది.
అందుకు సంబంధించిన మొదటి సమావేశం మొన్న హైదరాబాదులో జరిగింది. ప్రదర్శనశాల ప్రణాళిక, వస్తువుల జాబితా, విభాగాల వారి వివరాలు, ప్రదర్శన రీతుల గురించి నిపుణులు కూలంకషంగా చర్చించారు.
పాతదానికన్నా కొత్తది ముందంజలో ఉంటుంది. గత అనుభవాల నుండి నేర్చుకున్న గుణపాఠాలు, అభివృద్ధి చెందిన నమూనాల వెలుగులో కొత్తవాటిని ఆధునికంగా తీర్చిదిద్దే వీలుంది. ఐతే ఏదో ఒక నమూనాను ఎంచుకోవడంకన్నా మనమే ఒక కొత్త నమూనాని నిర్మించడం విజ్ఞత. అందుకు కావలసింది కొంత శ్రమ. ఆలోచన. సృజనాత్మక అన్వయం. నిజానికి ప్రదర్శనశాలల భౌతిక నిర్మాణం, గోడలు, పైభాగాలలో మార్పు కాదు. మొత్తం నిర్మాణంలో ఒక ఆత్మ ప్రతిబింబించాలి. పైకి అల్ట్రామాడరన్‌గా ఉన్నా ఆదివాసీ ఆత్మతో లోన విభాగాలు కళకళలాడాలి. లోగడ ప్రదర్శనశాలలో లేని కొత్త శక్తి నిండిపోవాలి. అది ఆదివాసీ వస్తువులలో, సంగీతంలో, సంస్కృతిలో, చారిత్రకాంశాలలో, జీవన విధానాలలో మిళితం కావాలి. అత్యాధునిక సాంకేతికతని ఉపయోగించుకోవాలి. కాని అది కృత్రిమతని ప్రదర్శించకూడదు. అచ్చెరువు కలిగించే సహజత్వాన్ని నింపడానికి అది ఉపయోగపడాలి. పూవులో సుగంధం కనబడని విధంగా సహజత్వం నిండిపోవాలి.
నిర్మాణంలో వాడే సామగ్రి, ఉపయోగించే వస్తువులు, రంగులు, శబ్దాలు అన్నీ ఆదివాసీ సహజాతాలుగా వెలిగిపోవాలి. తెచ్చిపెట్టిన, సమకూర్చిన, పోగేసినట్లుగా కనుపించకూడదు. ఇవి ఆదివాసీ వస్తువులు అని మనం చెప్పకూడదు. చూడగానే ఇట్టే అర్థంకావాలి. ఆ వస్తువులు ఆదివాసులవే కావచ్చు. కాని సహజస్థలంలో ఉండాల్సిన వాటిని మరో కొత్త ప్రదేశంలోకి తెచ్చిపెట్టడంవల్ల అవి పరాయాకరింపబడతాయి. అసలుసిసలు చోట ఉండే వాటిని బలవంతంగా (?), పెరకడంవల్ల వాటితో అనుబంధించిన ప్రకృతి, సహజాతాల నుండి పరాయికరింపబడతాయి. దీనిని కప్పిపుచ్చడానికి నిర్వాహకులు ఎన్నోరకాల గిమ్మిక్కులు చేస్తారు. అదిగో అక్కడే అసహజత్వానికి పాదుపడుతుంది. దీని పరిహరించడానికి సమగ్ర ఆదివాసీ వాతావరణంపై పట్టు, అధ్యయనం ఉన్నవారి నేతృత్వంలో వాటిని తీసుకురావాలి.
లోగడ ఇలాంటి పని ప్రదర్శనశాల క్యూరేటర్ చేసేవాడు. అతనే అన్నిరకాల నిర్ణయాలు తీసుకునేవాడు. వస్తువుల ఎంపిక, ప్రదర్శన అంతా అతని చెప్పుచేతుల్లో ఉండేది. ఒక రకంగా అది పాత పద్ధతి. కాని ఇప్పుడు అది పనికిరాదు. ఏ ఆదివాసీ పనిముట్టు, పరికరం, సామాగ్రి విలువైనది. దానిని ఎలా ప్రదర్శించాలి. ఏ కోణంలో దానిని చూపరులకు చూపాలి అన్నది ఆయా ఆదివాసీ తెగలవారే నిర్ణయించడం సముచితమని అత్యాధునిక ప్రదర్శనశాల అధ్యయనాలు తేల్చిచెప్పాయి.
ఇప్పుడు మరో ప్రశ్న ఉదయిస్తుంది.
ఎవరు నిజమైన తెగ మనుషులు.
కొండల్లో నివసించేవారా? కొండ కిందకు, కిందనుండి మూలనున్న గ్రామాలకు చేరిన ఆదివాసులా?
ఆధునిక నాగరికత దూరని అడవిలోని ఆదివాసులా? అడవుల నుండి బయటకు వచ్చి బతుకుతున్న వనవాసులా?
ఎంతోకొంత చదువుకుని అరకొర ఉద్యోగాలకోసం పాత ఆవాసాలను విడిచి వచ్చిన వారిని ఆదివాసీలు అనగలమా. జీవన విధానం, ఆహారం, దుస్తులు, కట్టుబొట్టు మార్చుకున్న వారిని ఈ పనిలో భాగస్వాములను చేయగలమా. కొండల మీద ఉండే గిరిపుత్రులు, అడవులలో ఉండే అటవీ పుత్రులు ఇలాంటి పనులు, ఒక రకంగా ఉద్యోగం చేయడానికి వెలుపలకు రాగలరా?
వచ్చినా రాకపోయినా వారిని ప్రదర్శనశాల నిర్మాణాన్ని రూపొందించడంలో భాగస్వాములను చేయగలగాలి. అప్పుడే గిరిజన ప్రదర్శనశాల ఆదివాసీకరింపబడుతుంది.
లోగడ ఆదివాసీ ప్రదర్శనశాలలలో ఆయా తెగలకు సంబంధించిన ఆవాసం, పని, మనుషుల బొమ్మలు, కొన్ని వస్తువులను ఉంచేవారు. వీటిని కృత్రిమంగా తయారుచేసి సహజమైన వాటిగా చూసే ప్రయత్నం చేసేవారు. వీటి రూపకల్పనలో ప్రాసంగికత తగ్గి, కృత్రిమత ఇట్టే కనుపించేది. కాని ఇప్పుడు అక్కడ ఉపయోగించే మెటీరియల్స్‌తోనే నిర్మించడం శాస్ర్తియమని నిపుణులు తేల్చిచెప్పారు.
ఈ సామగ్రిని ఆయా తెగలు నివసించే చోటులనుండి సేకరించితేవడం కష్టమైన విషయమే. తెచ్చి ఇక్కడ కొత్తగా నిర్మింపచేయడానికి ఆయా తెగలవారి సహకారం కావాలి. అందుకే సేకరణ, ప్రదర్శన రీతి, భద్రపరచడం వంటి రంగాలలో వారి తప్పనిసరి. చాలా ప్రదర్శనశాలల్లో వస్తువులే ఎక్కువ ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. అంటే కంటికి కానవచ్చే సంస్కృతే ఎక్కువ. కానరాని సంస్కృతి కూడా ఆదివాసుల్లో అధికం. గిరిజన కథలు, పురాణాలు, పండగలు, జాతరల్లో పా డే గానాలు, పాటలు ముఖ్యం. సంగీత వాద్యాల వాదన రీతులు, వాటి విలక్షణత కూడా అంతే అవసరం. వారి సామెతలు, పొడుపుకథలు, శబ్దాలు, దేవతల ఆవాహన ఉచ్ఛాటనలు (్ళ్ద్ఘశఆఒ) లేకుండా ఆదివాసీ జీవితాన్ని సమగ్రంగా చూపలేం. అవే వారి ప్రత్యేకత. వీటిని వినిపించగలగాలి. చాలా మంద్రస్థాయిలో సహజంగా రికార్డుచేసి వినిపించాలి.
ఐతే మరో ముఖ్యమైన విషయం ఏమంటే- ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలోగల పదహారు గిరిజన తెగలవారికి సమప్రాధాన్యత ఇవ్వాలి. ఏ తెగకైనా ఎక్కువ తక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే సమతౌల్యత దెబ్బతింటుందనే విషయం గుర్తించాలి.
నిజానికి ఎలాంటి సేకరణలయినా, ప్రదర్శన శాలలైనా ప్రస్తుతం 3్భరీ2 భావనని పరిహరించడం ముఖ్యం. అన్నీ ఒకచోటే ఉండాలనే ఆలోచన సరికాదనేది ఇటీవలి అనుభవం. ఏక కేంద్రీకరణకన్నా వికేంద్రీకరణే మంచిది. ఆ రకంగా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలలో మూడు గిరిజన ప్రదర్శనశాలలు ఏర్పాటుచేయడంవల్ల భవిష్యత్తులో వాటిని చక్కగా నడపవచ్చు. నిరంతరం వాటిని అభివృద్ధిచేయవచ్చు. కేంద్రంనుండి నిధులు కూడా తెచ్చుకునే వీలు ఏర్పడుతుంది.
నిజానికి ప్రపంచీకరణ నేపథ్యంలో, ఆధునిక సాంకేతిక ప్రభావంతో ఆదివాసీ జీవితం అతలాకుతలం అవుతున్నది. సహజ వస్తుసామగ్రి తయారీస్థానే నకిలీలు చేరిపోయాయి. అన్ని వస్తువులు, పరికరాలు ప్లాస్టిక్ రూపేణా సులభంగా లభిస్తున్నాయి. ఆదివాసీ గూడేలలో లోగడ తయారైన బుట్టలు, మట్టితో చేసిన పాత్రలు, పూసల పేర్పులు, నేత పద్ధతులు, చిత్ర రచనా విధానం అన్నీ గతానికి సంబంధించినవై పోతున్నాయి. అందువల్ల ముందు వాటిని సేకరించి పెట్టుకోవలసిన అత్యయిక పరిస్థితి ఏర్పడింది.
ప్రతి ఆదివాసీ తెగకి డిజైనులు, చిత్రాలు, ముగ్గుల వంటి బొమ్మలు ఉంటాయి. సవర చిత్రకళ, కోయల పగిడెలు, పటాలు వంటివి తయారీ పద్ధతులు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇలాంటి వాటి చిత్రాలను విదేశీ సంస్థలు ఉశజ్ఘూశళూళజూ ష్దజ్పళఒ వంటి ఫ్రణాళికలు ఏర్పాటుచేసి దేశ విదేశాలనుండి సేకరించి పెడుతుండగా మన దేశంలో, తెలుగు రాష్ట్రాలలో అలాంటి పని ఇంకా ప్రారంభం కాలేదు. కొత్తగా ప్రదర్శనశాల ఏర్పాటుచేస్తున్న కాలంలో నూతన టెక్నాలజీ సహకారంతో వాటి నమూనాలు, ప్రతిరూపాలు సేకరించి డిజిటైల్ ఫార్మట్‌లో భద్రపరిచే చర్యలుకూడా చేపట్టాలి. వాటి అసలులను కాకపోయినా ఇమేజెస్‌నైనా రాబోయే తరానికోసం దాచిపెట్టాలి. ఇలాంటి ఎన్నో అనుబంధ అంశాలు ప్రదర్శనశాలలో భాగం కావలసి ఉంది. నిజానికి ప్రదర్శనశాల అధ్యయన కేంద్రంగా కూడా ఉండాలి. ఆదివాసీ సాంస్కృతిక ప్రదర్శనలు, సమావేశ మందిరాల, జ్ఞాన వ్యవస్థల కేంద్రం కావాలి. అంటే లోగడ ప్రదర్శనశాలకన్నా ఇది ఎంతో కొత్తది. అపురూపమైన వ్యవస్థ.
బాక్సైట్ తవ్వకాలవల్ల, భారీ ఆనకట్టల నిర్మాణంవల్ల ఆదివాసుల బతుకే ప్రశ్నార్థకమవుతున్న వేళ, వారి సంస్కృతి సమూలంగా తుడిచి పెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడి ఉన్నది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ విషయంలో పునరాలోచనలు చేయడం అనివార్యం.
తెగలు నశించాక, సంస్కృతుల అవశేషాలు ప్రదర్శనశాలలో మిగిలినందుకు సంతోషించాలా? తెగలను బతికించే ఆలోచనలు చేసి ప్రదర్శనశాలల ద్వారా వారి చరిత్రను ఆత్మగౌరవాన్ని నిలుపుదామా?
ఏం చేద్దాం?

-జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242